August 07, 2014(Mana Kmareddy): కామారెడ్డి పట్టణంలోని అశోక్‌నగర్ కాలనీలో వాసవీస్కూల్‌కు సమీపంలోని ఓ వీధిలో మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పలు వాహనాలను పెట్రోల్ చల్లి నిప్పంటించారు. ఈ ఘటనలో ఓ కారు, బైకు దహనం కాగా, మరో బైకును రైలు పట్టాలపై పడేయడంతో రైలు ఢీకొని తుక్కుతుక్కయ్యింది. ఇంకో బైకును దహనం చేయడానికి ప్రయత్నించారు. అదే వీధిలో రెండు ప్రైవేటు బస్సుల్లో నుంచి డీవీడీ ప్లేయర్లు, ఇతర సామగ్రిని ఎత్తుకెళ్లారు. పోలీసుల వివరాల ప్రకారం... 5-8-407/బీ నంబరు గల ఇంటిలో నెల క్రితమే అద్దెకు చేరిన కృష్ణా జిల్లాకు చెందిన ఉప్పు రాజగోపాల్ అనే కాంట్రాక్టర్ రోజులాగే రాత్రి ఇంటి ముందర తన నిస్సాన్ మిక్రా కారు (ఏపీ 16జీ 14 నంబరు)ను నిలిపి ఉంచారు.