మన కామారెడ్డి: కామారెడ్డి డిగ్రీ కళాశాల ఆస్తుల వివాదం చిలికి చిలికి గాలి వానలా మారుతోంది. బుధవారం (28-01-2015) నాడు కామారెడ్డి ఐక్య కార్యాచరణ సమితి, జగన్నాథం గారి ఆద్వర్యంలో ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు..అప్పుడే దీక్ష శిభిరానికి నాయకుల తాకిడి మొదలయ్యింది. గురువారం నాడు ఏం యల్ సి షబ్బీర్ అలీ గారు మరియు ఏం యల్ ఏ గంప గోవర్ధన్ గారు, దీక్ష శిభిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఇది అలా వుండగా విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆద్వర్యంలో ఆమరణ నిరాహారదీక్షకు సంఘీభావం తెలుపుతూ విద్యార్థులు భారీ ర్యాలి నిర్వహించారు.ఇలా అన్ని పార్టీల నాయకులు సంఘీభావం తెలుపుతూ వుంటే అసలు సమస్యని పరిష్కరించేదేవరు అని ప్రజలు కోరుతున్నారు. వీలైనంత తొందరగా డిగ్రీ కళాశాల భూముల సమస్యను పరిష్కరించే భాద్యత మాత్రం ప్రభుత్వం లో వున్న పార్టీ మీదే వుందని ప్రజలు కోరుకుంటున్నారు.
 |
బుధవారం నాడు కామారెడ్డి ఐక్య కార్యాచరణ సమితి, జగన్నాథం గారి ఆద్వర్యంలో ఆమరణ నిరాహారదీక్ష ప్రాంరంభించిన దృశ్యం. |
 |
విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆద్వర్యంలో ఆమరణ నిరాహారదీక్షకు సంఘీభావం తెలుపుతూ విద్యార్థులు భారీ ర్యాలి |
 |
దీక్ష శిభిరాన్ని సందర్శించి సంఘీభావం తెలుపుతున్న ఏం యల్ ఏ గంప గోవర్ధన్ గారు.. |
 |
దీక్ష శిభిరాన్ని సందర్శించి సంఘీభావం తెలుపుతున్న ఏం యల్ సి షబ్బీర్ అలీ గారు. |