భిక్కనూరు, శ్రీ సిద్దరామేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో వున్నక్షేత్రపాలక శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయ 13వ వార్షికోత్సవ వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఆలయాన్ని రంగులు వేసి అందంగా అలంకరించారు. ఉత్సవాల రెండో రోజు స్వామి వారి శోభాయాత్ర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్దరామేశ్వర ఆలయ మహంత్ తో పాటు వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మూడో రోజు (మే 17 న) పూర్ణాహుతి తో ఉత్సవాలు ముగిసాయి.
Image Credit: Bhiknoor Facebook Page