విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్లు, ఫీజు రీయంబర్స్మెంట్ను ప్రభుత్వం ఇంతవరకు విడుదల చేయకపోవడంపట్ల నిరసనగా కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదుట ఏబివిపి కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో బుధవారం నాడు విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఏబివిపి నాయకులు మాట్లాడుతూ విద్యాహక్కు చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయంబర్స్మెంట్ అందక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.