ఆదివారం (13-07-2015) నాడు కామారెడ్డి, హౌజింగ్ బోర్డు కాలనీలోగల శ్రీసంకష్టహర గణపతి దేవాలయంలో గణపతి హోమాన్ని ఘనంగా నిర్వహించారు. నిరుద్యోగ యువతీ యువకులకు తొందరగా ఉద్యోగాలు లభించాలని కోరుతూ గంగవరం ఆంజనేయులు ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రీతిపాత్రమైన అష్టద్రవ్యాలతో హోమం నిర్వహించారు. ఈ సందర్బంగా స్వామి వారికి సహస్ర నామాలతో అభిషేకాలు, అర్చనలు జరిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆచార్యులు సంపత్‌కుమార్ శర్మ, సంజీవ్‌రావు, రమాకాంత్, నాగేశ్వర్, ఫణి, ప్రణీత్, ఆలయ కమిటీ సభ్యులు కిషన్, రవి, ఆంజయ్య, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.