తమ కులానికి రిజర్వేషన్ కల్పించి ఓబిసి లో చేర్చాలని డిమాండ్ చేస్తూ 21 ఏళ్ళ యువకుడు ప్రారంభించిన ఉద్యమం, దేశం మొత్తాన్ని ఆకర్షించింది. అయన పేరే హర్ధిక్ పటేల్. గుజరాత్ రాష్ట్రం లోని ఆర్థికంగా బలమైన పటేల్ సామాజిక వర్గానికి చెందిన ఈ యువకుడు తమ కులానికి రిజర్వేషన్ కల్పించి ఓబిసి లో చేర్చాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా కేంద్రంగా ప్రారంభించిన ఉద్యమం తార స్థాయికి చేరి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని గడ గడ లాడించింది. హార్దిక్ పటేల్ ఆధ్వర్యంలో సుమారు 5 లక్షల మందితో నిర్వహించిన పట్టిదారి మహా క్రాంతి ర్యాలీ, యావత్ దేశాన్ని తన వైపుకు చూసేలా చేసింది. సోషల్ మీడియాలైన ఫేస్బుక్, వాట్స్అప్ ల సహాయంతో లక్షలమందిని ఒక్క తాటి పై తెచ్చిన తీరు ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా ప్రాధాన్యతను చెప్పకనే చెప్పాడు హార్దిక్ పటేల్.
ఈ కులాల గొడవలు, రిజర్వేషన్ గొడవలు కాసేపు పక్కన పెడితే, యువకుడుగా హర్ధిక్ పటేల్ చేసిన ఉద్యమం యావత్ యువతకు స్ఫూర్తి గా నిలిచిందనటంలో ఏమాత్రం సందేహం లేదు.