దేవాలయ అర్చక, ఉద్యోగుల రాష్ట్ర వ్యాప్త సమ్మె కారణంగా అర్జీత సేవలు నిలిచిపోవటంతో దాని ప్రభావం దక్షిణ కాశిగా పేరుగాంచిన ప్రసిద్ద భిక్కనూరు శ్రీ సిద్దరామేశ్వర స్వామి దేవస్థానంలో స్పష్టంగా కనిపించింది. శ్రావణ సోమవారం సందర్భంగా శ్రీ సిద్దరామేశ్వర స్వామి దర్శనం కోసం సుదూర ప్రాంతాలనుండి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు అర్చకుల సమ్మె కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. కనీసం గర్భగుడిలో కి వెళ్ళి స్వామి వారిని దర్శించుకోకుండా గర్భగుడికి తాళాలు వేయటంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. అర్చకులు ఏమైనా డిమాండ్స్ ఉంటే ప్రభుత్వంతో నేరుగా చర్చలు జరపాల్సింది పోయి, దేవుడిని బందీగా చేసినట్టు అర్చకులు గర్భగుడికి తాళం వేయటం ఏమిటని భక్తులు తమ భాదను వ్యక్తం చేసారు.
ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్చక సంఘాలతో చర్చలు జరిపి అన్ని దేవాలయాల్లో అర్జీత సేవలను పునరుద్దరించాలని భక్తులు కోరుతున్నారు.
![]() |
గర్భగుడికి తాళం వేసిన దృశ్యం |
![]() |
దర్శనం కోసం బారులు తీరిన భక్తులు.. |