కామారెడ్డి లో వినాయక నిమజ్జన శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. శోభాయాత్ర కోసం వినాయకులను తీసుకోని వెళ్ళే వాహనాలను ఎంతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా కామారెడ్డి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద స్వాగత వేదికను ఏర్పాటు చేసారు. వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి శోభయాత్రని తిలకిస్తున్నారు. యువకుల నృత్యాల మధ్య కన్నుల పండుగగా గణేష్ శోభాయాత్ర ముందుకు కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితమే కామారెడ్డి డిఎస్పి ప్రారంభించిన గణేష్ శోభాయాత్ర అత్యంత శోభాయమానంగా ముందుకు కదిలి వెళ్తోంది.