తొలి దశ తెలంగాణా సాయుధపోరాట యోధుడు, కామారెడ్డి ముద్దుబిడ్డ శ్రీ ఫణిహారం రంగాచారి గారి విగ్రహ ఆవిష్కరణ తేది 22-11-2015 న విగ్రహావిష్కరణ కమిటి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద శ్రీ ఫణిహారం రంగాచారి గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలు - ఉద్యమాలు -ప్రజాస్వామిక విలువలు అనే అంశంపై కర్షక్ బి.ఇడి. కళాశాలలో సదస్సు నిర్వహించారు.