సోమవారం జరిగిన కామారెడ్డి డిగ్రీ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలోనే మంచి పేరు వున్న కామారెడ్డి డిగ్రీ కళాశాల ఆస్తులను త్వరలోనే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, కళాశాలకు పూర్వ వైభవం తీసుకరావడానికి కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1975 వ సంవత్సరంలో నిజామాబాద్లో సిండికేట్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు కళాశాల ముందు నుంచే రోజు వెళ్తుతుండే వాడినని గుర్తు చేశారు. నిజామాబాదులో వున్న గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కన్నా కామారెడ్డి డిగ్రీ కళాశాల భవన సముదాయం బాగుందని కొనియాడారు. పొరుగు రాష్ర్టాల నుంచి విద్యార్థులను ఆకర్షించిన చర్రిత కామారెడ్డి కళాశాలదేనని తెలిపారు.
ప్రభుత్వం డిగ్రీ కళాశాల భూములు, భవనాలు ఇతర ఆస్తులు ప్రభుత్వపరం కాకపోవడంతో అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. కళాశాల ఆస్తుల స్వాధీనానికి కలెక్టర్ ను స్పెషల్ అధికారిని నియమించినట్లు చెప్పారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జేసీ రవీందర్రెడ్డి, కళాశాల ప్రి న్సిపాల్ ప్రభాకర్ నివేదిక ను త్వరగా ప్రభుత్వానికి పంపించాలన్నారు. నివేదిక అందగానే ప్రభుత్వప రం చేసుకున్నట్లు ఉత్తర్వు లు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను 1964లో ఈ ప్రాంత రైతులు, వ్యాపారులు 263 ఎకరాలను పోగు చేసి ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా SFI, PDSU మరియు AISF మొదలగు విద్యార్థి సంఘాల నాయకులు ఉప ముఖ్యమంత్రిని కలిసి కళాశాల ఆస్తుల గురించి వినతి పత్రం సమర్పించారు.