దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ సిద్దరామేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం నాడు శ్రీ సిద్దరామేశ్వర స్వామి వారి కళ్యాణం, భువనేశ్వరి దేవితో వేదమంత్రోచ్చారణల మధ్య, ఆలయ మహంత్ మరియు ఆర్చక బృదం ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ మహంత్ ఆధ్వర్యంలో సిద్దగిరి, రామగిరి యోగిపుంగవుల సమాధుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాత్రి ఆలయ మహంత్ విభూతి ధారణతో రుద్రాకారుడై సమాధుల వద్ద నుండి ఆలయం వరకు పరుగెత్తాడు. అనంతరం స్వామివారి విమాన రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రథాన్ని లాగటానికి భక్తులు పోటిపడ్డారు బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో రోజు వేల సంఖ్యలో వచ్చిన భక్తుల మధ్య శివ నామస్మరణతో మారుమ్రోగిపోయింది.