కామారెడ్డి డివిజన్ లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణంలో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భారీ శోభయాత్ర నిర్వహించారు. శోభయాత్రను భజరంగ్ దళ్ జాతీయ ప్రముఖ్ రాజేష్ పాండే ప్రారంభించారు. వేలాది మంది భక్తులతో కోడూరు హనుమాన్ మందిరం నుండి ప్రారంభమైన శోభయాత్ర, సిరిసిల్ల రోడ్ మీదుగా తిరిగి కోడూరు హనుమాన్ మందిరం వద్ద ముగిసింది.
వివిధ మండలాల్లో...
హనుమాన్ జయంతి వేడుకలు వివిధ మండలకేంద్రాల్లో ఘనంగా జరిగాయి. భిక్కనూరులో
భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభయాత్ర నిర్వహించారు. దోమకొండ లో శివరాం మందిర్ లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాచారెడ్డి లో శోభయాత్ర నిర్వహించారు. సదశివనగర్, గాంధారి, తాడ్వాయి మండలాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

![]() |
భిక్కనూరులో.. |