ఒక్క మార్క్ తో టెట్ లో క్వాలిఫై కాలేదని కామారెడ్డి మండలం అడ్లూర్ కి చెందిన సుష్మిత (21) అనే యువతి రైలు కింద పడి మృతిచెందింది. కూలి పనికి వెళ్ళి మరి చదివించిన తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేక భవిష్యత్తులో తను టీచర్ కాలేననే బాధతో ఆత్మహత్య చేసుకుంది. టెట్ లో క్వాలిఫై కాని తాను టీచర్ ఎలా కాగలనని ఆవేదనకు గురై భిక్కనూరు మండలం తలమడ్ల రైల్వే స్టేషన్ వద్ద వేగంగా వస్తున్న రైలు కింద అందరూ చూస్తుండగానే పడిపోయి ముక్కలయ్యింది.