
మన కామారెడ్డి: స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో మంగళవారం ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఆర్డీవో, తహసీల్దార్లకు వినతి పత్రం సమర్పించారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్ణ కార వృత్తిని పరిరక్షించటానికి స్వర్ణకార ఫెడరేషన్ ఏర్పాటు చేసి 100 కోట్లు కేటాయించాలని, వృద్ద స్వర్ణకారులకు రూ.1500 పింఛన్లు ఇవ్వాలని, పోలీసుల అక్రమ రికవరీలను అరికట్టాలని, 272 జివోను అమలుపరిచాలని. వృత్తి నైపుణ్యం కోసం ఆదునాతన పనిముట్ల కోసం సబ్సిడీ రుణాలు అందజేయాలని, తదితర డిమాండ్లు వెల్లడించారు. స్వర్ణకారుల దీక్షలకు కాంగ్రెస్ నాయకులతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు మద్దతు తెలిపారు. ఈ సంధర్భంగా పట్టణ వ్యాప్తంగా స్వర్ణ కారులు దుకాణాల బంద్ పాటించారు

