
అందరూ సామాన్యులగురించి మాట్లాడుతే ముచ్చటేస్తోంది.
నేటి పరిమాణాలు నేపథ్యంలో సామాన్యుడి గురించి మాట్లాడుతున్న, అసామాన్య సహచరులను చూస్తుంటే, మాలాంటి సామాన్యులమీద మీకు ఇంత జాలి,కరుణ ఉన్నదని తెలిసి మా కడుపులో కణుతులు, మెదడులో ట్యూమర్లు చికిత్సరహితంగానే చిక్కిపోతున్నాయి..
ఇన్నాళ్లు డబ్బున్నవాళ్ళకి జాలి,కరుణ ఉండదని అనుకున్న మాకు మీ ప్రేమాభిమానాలు చూస్తుంటే, మీరు సామాన్యులమీద మీరు కురిపిస్తున్న ఆర్ధతకు మా ధమనుల్లో పేరుకున్న క్రొవ్వు ఇట్టే కరిగిపోతుంది.
ఓ మా అసమాన్య సహచారులారా.....,
మేము కూలి దొరక్క రెండుమూడు రోజులు ఆకలితో ఉన్నప్పుడు మీకు మా గురింఛి తెలియదేమో అనుకున్నాం..
పసివాళ్ళకి పాలు కొనలేక ఎదుస్తున్నప్పుడు మీకు పాల ప్యాకెట్లు ఒకరోజు కొనకుంటే ఎంత బాధ కలుగుతుందో తెలియదేమో అనుకున్నమ్..
ATM, పక్కన పెట్టి, కనీసం బ్యాంకు ఖాతా కూడా లేని మాకు నీళ్ళ దగ్గర, రేషన్ షాపుల్లో గంటలు గంటలు నిలబడ్డప్పుడు మాకు కలిగేబాధ మీకు తేలియదనుకొని తప్పుగా అనుకున్నాం.
జేబులో చిల్లర కూడా లేకుండా, వారం వారం రోజులు గడిపిన మా రోజులు మీకుఅర్థం కావేమో అనుకున్నాము..
గంజిత్రాగి రోజులు ఏళ్లదీసిన మాగరీబు బతుకులు ,బెంజిల్లో తిరిగే మీకు తెలియవేమో అని దిగులుపడ్డం.
ఓ... మా అసామాన్య సహచర భారతీయుయుల్లారా..!
మీరు సామ్యాన్యుల గురించి ఆలోచిస్తుంటే అతి త్వరలోనే భారతదేశం , భానుడిలా మెరిసిపోతుందేమో అని అనిపిస్తుంది.
మీ లాకర్లలో ఉన్న లక్షల కోట్ల సంగతి పక్కనపెట్టి మరీ మీరు సామాన్యుల గురించి పడుతున్న తపన చూస్తుంటే మేము మిమ్మల్ని అపార్థం చేసుకొని మాహాపచారం చేసామేమో అనుకుంటున్నాం.
ఇట్లు
మీ
-సహచర సామాన్యుడు.