
కామారెడ్డి మండలం టేకిర్యాల్ లో విషాదం చోటుచేసుకుంది. ఓక మనవరాలు తన నానమ్మ చనిపోవటంతో తలకొరువు పెట్టింది. వివరాల్లోకి వెళితే...
సందుల పోచవ్వ అనే వృద్ధురాలు తన ఏకైక కొడుకు మరియు కోడలు మృతి చెందటంతో మనువరాలు భవాని(19) ని పోషిస్తూ వస్తోంది. హఠాత్తుగా ఆ వృద్ధురాలు చనిపోవటంతో తల కోరువు పెట్టె వారు ఎవరు లేక మనవరాలైన భవానినే తన నానమ్మకు తల కోరువు పెట్టింది. ఈ సంఘటన గ్రామంలో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. గ్రామంలో ప్రజలు చందా వేసి చనిపోయిన పోచవ్వ అంత్యక్రియలు నిర్వహించారు.