Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Monday, May 14, 2018

Mana Kamareddy

అమ్మ కన్నీళ్లకు బిడ్డ పశ్చాతాపం ఇది..!



నిన్న మదర్స్ డే సందర్భంగా సోషల్ మీడియా గ్రూపులతో  'అమ్మ' గురుంచి రకరకాల మెసేజ్ లు, అమ్మ తో దిగిన ఫొటోలతో మొత్తం నిండిపోయింది. అలాగే ఒక కొడుకు తన తల్లి పడ్డ బాధలను గుర్తు చేసుకుంటూ కొడుకు చూపిన పశ్చాతాపం, భాధ ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. కాస్త సమయం తీసుకోని మరి ఒక్కసారి చదవండి.
నిన్న రాత్రి అప్పటికే మూడు ఫోన్లు మాట్లాడాను..ఇక బాగా పొద్దు పోయింది పడుకుందాం అనుకొనే లోపున మళ్ళీ మొబైల్ మోగింది....చూస్తె నా స్నేహితుడు జంషెడ్ పూర్ నుండి...ఇంత రాత్రి ఏమిటి విషయం అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసాను....అయితే చిత్రంగా అటు ఉన్నది మా స్నేహితుడి కొడుకు మనోజ్....
ఏమిటి సంగతి అని అడిగాను.....తను సుమారు అరగంట పైనే అక్కడి విషయాలు చెప్పాడు....
తర్వాత మా మిత్రుడిని పిలిచి తన తోనూ మాట్లాడాను....బహుశా తన అభిప్రాయాన్ని నేను మార్చలేనేమో అనిపించింది.
సరే..అసలు విషయం చెబుతాను.
ఎప్పుడో ముప్ఫై ఏళ్ళక్రితం అతనికి పెళ్లి అయ్యాక ..ప్రతి ఇంట్లోనూ  ఉన్నట్లే  అతని ఇంట్లోనూ అత్తా కోడళ్ళ గొడవలు మొదలయ్యాయి....మొదట్లో ఇద్దరికీ నచ్చ చెప్పాడు...తరువాత పరిస్థితి తన చెయ్యి దాటిపోయాక...భార్య అతనికి దూరంగా మెలగడం తో తల్లి ని ఎడం పెట్టాడు....అలా తల్లి ని ఆఖరికి ఒక అనాధ పరిస్థితి  కి తీసుకు వచ్చాడు.

తరచూ క్యాంపులకు వెళ్ళే ఉద్యోగం  కావడంతో...ఒకసారి ఇంటికి వచ్చేటప్పటికి తల్లి పడక గదిలోంచి బాత్ room కి వెళ్ళే నడవ లో ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు....భార్యతో ఘర్షణ పడలేక తల్లి విషయం చూసి చూడనట్లు ఉండిపోయాడు....
ఇరుకైన ఆ తోవలో...బాత్ room కి దగ్గరగా గాలి..వెలుతురూ లేని ఆ ప్రదేశం లో ఆ తల్లి కొన్ని నెలలు తీసుకొని తీసుకొని పోయింది....
ఇప్పుడు అదంతా జరిగిన పదేళ్ళ తర్వాత తను తన తల్లికి చేసిన అపరాధానికి ఆ భగవంతుడు తనను శిక్షించ కుండా ఉండదు కాబట్టీ ఆ శిక్ష ఎదో తనకు తానె విధించుకోవడం మంచిది అనుకున్నాడు....అనుకున్నదే తడవగా ఆ రోజు తల్లికి ఎక్కడ మంచం వేసారో ఆకడే మంచం వేసుకొని ...ఫ్యాన్ కూడా లేకుండా రాత్రుల్లు పడుకోవడం మొదలెట్టాడు....
అక్కడ గాలి ఎక్కువగా రాదు...వెంటిలేటర్ మాత్రమె ఉంటుంది....పైగా దగ్గరలో బాత్ room ల దుర్గంధం....దోమలు కూడా ఎక్కువే....భార్య పిల్లలు చెప్పుఇనా కూడా ముందు గదులలోకి వచ్చి పడుకోవడం లేదు....ఆ దోమలకి అక్కడి వాతావరణానికి వైరల్ ఫీవర్ వచ్చినా మందులు వేసుకోవడం లేదు....
ఆ రోజుల్లో తల్లిని ఎంత కష్టానికి లోను చేసానో అని ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు....బంధువులు స్నేహితులు ఎందరు నచ్చచెప్పినా వినడం లేదు....
చనిపోయేవరకూ ఇక్కడే పడుకుంటాను..తల్లిని కష్టపెట్టిన నాకు సదుపాయాలూ వాడుకోవడం ఇష్టం లేదు..ఆ రోజు ఆమెకోసం ఫ్యాన్ కూడా ఇక్కడ పెట్టడాన్ని నేను ఊహించలేదు...ఇప్పుడు నేను ఫ్యాన్ కూడా వాడను అంటూ తన అభిప్రాయం చెప్పాడు.
రాత్రి నేను ఫోన్ లో ఎంత చెప్పినా వినలేదు..లేదు నాకు ఈ శాస్తి జరగాల్సిందే....భగవంతుడు నాకు ఎలానూ శిక్ష వేస్తాడు..అదీ ఈ జన్మ లోనే వేస్తాడు....అందుకే నేను ఇప్పటి నుండే ఆ శిక్ష కు సిద్ధంగా ఉన్నాను...నాకు అతనికి వేడుకొనే అర్హత లేదు....
నేనేమి చెప్పలేక వాళ్ళ అబ్బాయి తో జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను....అతనికి కర్మ సిద్ధాంతం మీద నమ్మకం ఉంది...అందుకే ఆ దేవదేవునికి ఫిర్యాదు చేసుకొనే ఉద్దేశం లేదు. శిక్ష వద్దని గానీ ఆ శిక్షలో తీవ్రతల తగ్గింపు కు గానీ అతను సమ్మతించడం లేదు....కానీ ఆ రోజుల్లో అలా ఉంది..ఇప్పుడు బాధపడి ఏమి లాభం..ఆ కోడలు కూడా చాలా బాధ పడింది..అప్పట్లో తన ప్రవర్తనకి.



Subscribe to this Mana Kamareddy Portal via Email :