Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks
Showing posts with label Bathukamma. Show all posts
Showing posts with label Bathukamma. Show all posts

Saturday, October 01, 2016

Mana Kamareddy

వివిధ టీవీ ఛానళ్ళు, జానపద గాయకులు రూపొందించిన బతుకమ్మ పాటలు(2016) మీకోసం..(వీడియోలు)

తెలంగాణ వ్యాప్తంగా కన్నుల పండగగా జరుపుకునే బతుకమ్మ పండుగకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యంత ప్రాచుర్యం ఏర్పడింది. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులు బతుకమ్మ ఆడుతూ పాడుకొనే పాటలు లెక్కకు మించి ఉంటాయి. వాటికి తోడు ఈ సంవత్సరం కొన్ని టీవీ చానెల్స్ కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసి వీడియోలను రూపొందించాయి. తెలంగాణ వ్యాప్తంగా పల్లెల్లో ఆడపడుచులు పాడుకొనే పాటల్లో దేవతలను కొలువటంతోపాటు, సమాజంలో సమస్యలు కొన్ని సాంఘిక అంశాలు కూడా పాటలో చేర్చి పాడుతుంటారు. అందులో భాగంగానే దేశంకోసం కోసం తమ ప్రాణాలను త్యాగం చేస్తూ భారతావనిని కాపాడుతున్న భారత సైనికులను తలుచుకుంటూ పాడే జై కొట్టు జైవాను ఉయ్యాల్లో.. అనే పాటను మనకామారెడ్డి పోర్టల్ లో చూసాం. ఈ సంవత్సరం వివిధ తెలుగు టీవీ ఛానళ్ళు రూపొందించిన పాటలు మీ కోసం... 

V6 ఛానల్ రూపొందించిన బతుకమ్మ పాట:
 

TV9 ఛానల్ రూపొందించిన బతుకమ్మ పాట:



6TV ఛానల్





రాణి రుద్రమ రూపొందించిన బతుకమ్మ పాట:



రోల్ రిడా రూపొందించిన బతుకమ్మ పాట:





99TV ఛానల్ రూపొందించిన బతుకమ్మ పాట:



మాట్ల తిరుపతి అనే జానపద గాయకుడు రూపొందించిన బతుకమ్మ పాట:



మల్లన్న సాగర్ బాధితురాలు పడుతున్న బతుకమ్మ పాట:


Read More

Tuesday, October 20, 2015

Mana Kamareddy

కామారెడ్డి డివిజన్ లో ఘనంగా బతుకమ్మ పండుగ..

 కామారెడ్డి డివిజన్ లో బతుకమ్మ పండుగ ఘనంగా జరిగింది. కామారెడ్డి మండలంతోపాటు , దోమకొండ, భిక్కనూరు, ఎల్లారెడ్డి, తాడ్వాయి, లింగంపేట్, సదాశివనగర్, గాంధారి, మరియు నాగిరెడ్డిపేట్ మొదలగు మండల కేంద్రాలతోపాటు , వివిధ గ్రామాల్లో నిన్న ఉదయం నుండే పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం నుండే  మహిళలు బతుకమ్మలను రంగురంగుల పూలతో పేరుస్తూ, సద్దుల బతుకమ్మకోసం సద్దులు, మలిద ముద్దలు  తయారు చేస్తూ గడిపారు. సాయంత్రం బాజా బజంత్రిల తో వారి వారి కూడళ్ళకు చేరుకొని ఆట పాటల మధ్య బతుకమ్మ ఆడారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసి సద్దులు ఆరగించారు.

కామారెడ్డి డివిజన్ లో బతుకమ్మ పండుగ దృశ్యాలు..

క్యాసంపల్లిలో



భిక్కనూరులో


భిక్కనూరులో

Image Credit:
Kamareddy District Page
Bhiknoor Page
Mana Bhiknoor Page
Deme Kaalan Page



Read More

Thursday, October 15, 2015

Mana Kamareddy

కామారెడ్డి పట్టణంలో ఘనంగా బంగారు బతుకమ్మ వేడుకలు..

కామారెడ్డి పట్టణంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ వేడుకలు వేలాది మంది మహిళల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్యక్షురాలు, నిజామాబాదు ఎంపి కవిత ముఖ్య అతిథిగా హాజరై, కామారెడ్డి రైల్వే స్టేషన్ చౌరస్తా నుండి సాయంత్రం 6-30 గంటలకు ర్యాలీగా వెళ్ళి వీక్లీ మార్కెట్ గ్రౌండ్ కి చేరుకున్నారు. తదనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ యోగితా రాణా, కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మ, నిజామాబాదు మేయర్ సుజాత మరియు జెడ్పి వైస్ చైర్ పర్సన్ సుమనా రెడ్డి ఎంపి తో కలిసి బతుకమ్మ ఆడారు. అంతకుముందు ఎంపి, పట్టణంలోని వివిధ నాయకుల ఇళ్ళకి వెళ్ళి బతుకమ్మ పేరుస్తూ, పాటలు పాడుతూ మహిళలను అలరించారు.

అనంతరం జరిగిన సభలో ఎంపి కవిత మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కావడం ఖాయమని అన్నారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి తాగునీరందిస్తామని వెల్లడించారు. పదిహేను నెలల కాలంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినమని అన్నారు.


కామారెడ్డి పట్టణంలోని బంగారు బతుకమ్మ వేడుకల దృశ్యాలు మీకోసం..















Read More