చదువుల తల్లి శ్రీ సరస్వతి ఆలయం కామారెడ్డి జిల్లా కేంద్రానికి సుమారు కిమీ దూరంలో ఇల్చిపూర్ గ్రామంలో నూతనంగా నిర్మింపబడింది. పార్శి విఠల్ పటేల్ ఆధ్వర్యంలో నిర్మింపబడిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మొదలగు కార్యాక్రమాలు డిసెంబర్ 14 తేది నుండి 16 వ తేది వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. సుమారు మూడు ఎకరాల స్థలంలో ఈ ఆలయాన్ని ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రగా ఆభివృద్ధి చేయనున్నారు. అనంత సాగర్ శ్రీ సరస్వతి క్షేత్ర నిర్మాతైన శ్రీ అష్టకాల నరసింహ రామశర్మ ఆధ్వర్యంలో, భక్తుల సమక్షంలో శ్రీ సరస్వతి మాత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది.
|
ఆలయంలో కొలువైవున్న అమ్మవారు.. |