Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks
Showing posts with label Do you know?. Show all posts
Showing posts with label Do you know?. Show all posts

Friday, July 17, 2015

Mana Kamareddy

ఈ మెయిల్ ని కనిపెట్టింది మన భారతీయుడే!

ఈ మెయిల్ గా పిలువబడే ఎలక్ట్రానిక్ మెయిల్ ని కనుక్కోన్నది ఎవరో తెలుసా?
32 సంవత్సరాల క్రితం జూలై 15 న ఈ మెయిల్ ని కనుక్కోన్నది ఇండో అమెరికన్ అయిన V A.శివ అయ్యదురై. అతను ఈ మెయిల్ కనుకున్నప్పుడు అయన వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. ముంబై లో జన్మించిన అయన కుటుంబం మూలాలు మాత్రం తమిళనాడు కి చెందినవి.


 స్కూల్ కి వెళ్ళే వయసులో శివ అయ్యదురై 'ఇంట్ర ఆఫీస్ మేస్సజింగ్ సిస్టం' ని కనుక్కున్నాడు, దీనినే మనం ఈ మెయిల్ అని పిలుస్తున్నాము. ఇంట్ర ఆఫీస్ మేస్సజింగ్ సిస్టంలో ఇన్ బాక్స్ , అవుట్ బాక్స్ , ఫోల్డర్, మెమో  మరియు అటాచ్మెంట్ మొదలగు ఫీచర్స్ ఉండేవి. ఇంట్ర ఆఫీస్ మేస్సజింగ్ సిస్టం కోసం అయన 50000 లైన్ ల కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోడ్ రాసాడు. అమెరికా ప్రభుత్వం 30 ఆగష్టు 1982 న ఆధికారికంగా శివ అయ్యదురై కి గుర్తింపు తో పాటు అవార్డు నిచ్చి మొట్టమొదట కాపీ రైట్ ని అతనికి అందజేసింది. వివిధ కారణాల వల్ల శివ అయ్యదురై పేరు కంప్యూటర్ సైన్స్ రంగంలో అంతగా ప్రాచుర్యం పొందలేదు కాని భారతీయుల మేధాశక్తి ని ప్రపంచానికి చాటిచెప్పిన శివ అయ్యదురై నిజంగా అభినందనీయుడు. 


Read More

Thursday, July 09, 2015

Mana Kamareddy

నిజమైన బాహుబలి గురించి మీకు తెలుసా!!

కర్నాటక లోని శ్రావనబెళగొళలో ఉన్న బాహుబలి విగ్రహం 

బాహుబలి అని గూగుల్లో సెర్చ్ చేస్తే గత కొద్దిరోజులుగా వస్తున్నది ప్రభాస్ గురించో, రాజమౌళి గురించో లేక రానా గురించో, అంతకు మించితే ట్రైలర్ల హడావుడి గురించో కనబడుతోంది. కానీ సహనానికి ఐకాన్ లాంటి బాహుబలి మన గడ్డపై నిజంగా నివసించిన అసలు సిసలు బాహుబలి గురించి ఎక్కడా కనబడదు,వినబడదు. అవును బాహుబలి సహనానికి కెరాఫ్ అడ్రస్ లాంటి వాడు, యుద్దాన్ని వద్దన్న శాంతిదూత,రాజ్యాల కోసం తలలు నరుక్కుంటుంటే రాజ్యాన్నే గడ్డిపోచగా భావించిన వ్యక్తి అతను. సుఖాల కోసం, భోగాల కోసం పరితపిస్తుంటే రాజుగా ఉండి కూడా సాధు జీవితాన్ని గడిపిన ఆదర్శమూర్తి అతను.

కాస్త చరిత్రలోకి తొంగి చూద్దాం!!
ఋషబుని కుమారుడు బాహుబలి. ఇతనికే గోమఠేశ్వరుడనే పేరు .ఇతడికి ఇద్దరు భార్యలు.రాజ్యాన్ని పిల్లలందరికీ సమానంగా పంచాడు.పెద్ద భార్య పెద్ద కొడుకు భరతునికి రాజదాని కోసల పట్టణాన్ని అప్పగించి మిగిలిన కొడుకుల రాజ్యభారం బాధ్యత కూడా అప్పగించాడు.భరతునికి రాజ్యాన్ని విస్తరించాలన్న కోరిక కలిగింది.తమ్ముళ్ళందరిపై దండయాత్ర చేశాడు.బాహుబలి మినహా అందరూ రాజ్యాన్ని భరతుని వశం చేసి తపస్సు చేసుకోవడానికి తండ్రి వద్దకు వెళ్ళిపోయారు.అన్న దురాక్రమణ సహించలేని బాహుబలి భరతుని ఎదిరిస్తాడు.స్వతహాగా శాంతికాముకుడైన బాహుబలి యుద్దంలో అనవసరమైన ప్రాణనష్టాన్ని వద్దని ద్వంద్వ యుద్దం చేసి గెలుస్తాడు.భరతుడిని చేతులతో పైకెత్తి నేలకు కొట్టబోయి,అంతలోనే పునరాలోచనలో పడతాడు.

బాహుబలి ఇహపరమైన సుఖాల కోసం పాపపు పనులు చేయడం ఎందుకని భరతుని వదిలివేసి,రాజ్యాన్ని అతడికే అప్పగించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు.ఇంద్రగిరి కొండపై బాహుబలి తపస్సు చేసి మోక్షం పొందిన ప్రాంతంలోనే దేవాలయ నిర్మాణం జరిగినట్లు భావిస్తారు.మన దేశంలో బౌద్దజైన మతాలు రెండూ దాదాపుగా ఒకే సమయంలో ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ బౌద్దం వ్యాపి చెందినంతగా జైనం విసృతం కాలేదు.జైన మతంలో సన్యాసులు పాటించిన నియమాలు మరీ కష్టమైనవి కావడంతో దీన్ని ఆచరించడానికి ఎక్కువ మంది ముందుకు రాలేదు.కఠిన నియమాల కారణంగానే శ్వేతాంబరులు, దిగంబరులు అని రెండు వర్గాలుగా విడిపోయారు.శ్వేతాంబరులు ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల ఉన్నారు.వీరు సంసార జీవితం కొనసాగిస్తారు.దిగంబరులు సన్యాసులు.వీరు దైవ చింతనలో ఉంటూ శరీరాన్ని కృశింప చేసి నిర్యాణం పొందే దీక్షలో ఉంటారు.

బాహుబలి విగ్రహం కర్నాటక లోని శ్రావనబెళగొళ లో ఉంది. 58 అడుగులున్న విగ్రహం దేశంలోని జైన తీర్థంకరుల విగ్రహాలన్నింటిలోకి పెద్దది. క్రీ..983 సంవత్సరంలో ఇంద్రగిరి పర్వతంపై విగ్రహాన్ని చెక్కించినట్లు చారిత్రక కథనం.






Read More

Saturday, June 27, 2015

Mana Kamareddy

ముత్యాలు ఎలా తయారవుతాయో తెలుసా?


ముత్యాలు ఎలా తయారవుతాయో అని ఇప్పటికి చాలా మందికి సందేహం కలుగుతువుంటుంది.
ముత్యాలు మొలస్కా జాతికి చెందిన ఆల్చిప్పలు అనే జీవులలో తయారవుతాయి. పరాన్నజీవులుగానీ, ఇసుకరేణువులుగానీ ఆల్చిప్పలోకి ప్రవేశించినప్పుడు వాటి బారి నుండి, రాపిడి నుండి తప్పించుకొని ఆత్మరక్షణ చేసుకోవడం కోసం ఆల్చిప్ప వాటి పైకి ఒక ప్రత్యేకమైన ద్రవ పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఆ పదార్థమే ఆ పరాన్నజీవుల లేదా ఇసుకరేణువుల చుట్టూ చేరి గట్టిపడి ముత్యంగా రూపాంతరం చెందుతుంది.
       నిజానికి సహజంగా తయారయ్యే ముత్యాలు చాలా తక్కువ. మన అవసరాలకు ఏమాత్రం సరిపోవు. అందువల్ల ముత్యపు పరిశ్రమ వాళ్లు ఆల్చిప్పలోకి ఇసుకరేణువుల్నిగానీ, చిన్న గుల్లముక్కల్నిగానీ కృత్రిమంగా ప్రవేశపెట్టి ఎక్కువ ముత్యాల్ని పొందుతారు. నిజంగా ప్రకృతి ఎంత విచిత్రమైనధొ కధూ!!


Read More

Thursday, June 18, 2015

Mana Kamareddy

దేవాలయానికి వెళ్ళినపుడు పాటించవలసిన నియమాలు..

దేవాలయానికి వెళ్ళినపుడు పాటించవలసిన నియమాలు..

  • తీర్ధము తీసుకొనునపుడు ౩సార్లు విడివిడిగా,ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా పుచ్చుకొనవలెను. వెంటవెంటనే మూడుసార్లు ఒకేకాలమున తీసుకొనరాదు.
  • ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి, దానితో రెండు ఒత్తులను(దీపారాధన) వెలిగించాలి. ఉదయంపూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపము యొక్క ముఖం ఉండాలి.సాయంత్రము పూట ఒక ఒత్తి తూర్పుగా,రెండవది పడమటగా ఉండాలి.
  • శివునికి అభిషేకం,సూర్యునికి నమస్కారం, విష్ణువుకి అలంకారం, వినాయకునికి తర్పణం,అమ్మవారికి కుమ్కుమపూజ ఇష్టం .ఇవి చేస్తే మంచి జరుగుతుంది.
  • ధైవప్రసాదాన్ని తినాలి కాని పారవేయరాదు.
  • దీపమును నోటితో ఆర్పరాదు. ఒక దీపం వెలుగుచుండగా, రెండవదీపాన్ని మొదటిదీపంతో వెలిగించరాదు. దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు.
  • దేవునిపూజకు ఉపయోగించు ఆసనం వేరొకపనికి వాడరాదు.
  • దేవాలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం ,స్తోత్రములు చదవకూడదు. ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి.
  • పురుషులు దేవునికి సాష్టాన్గానమస్కారం చేయవచ్చు.స్త్రీలు చేయరాదు. వారు మోకాళ్ళపై వంగి,నుదురును నేలకు ఆనించి నమస్కారం చెయ్యాలి. యుద్దమునకై శంఖమును పూరించుచున్న కృష్ణుడు మరియు ఒక్కడే నిలబడి వేణువు ఊదుతున్న కృష్ణుడు ఫోటో గాని,విగ్రహం గాని ఇంటిలో ఉండరాదు. మరియు ధ్యానం చేయుచున్న ఈశ్వరుడు,హనుమంతుడు ఫోటోలు ఉండరాదు. లక్ష్మీ దేవి కూర్చునిఉన్న ఫోటోగాని,విగ్రహంగాని ఉండాలి.నిలబడి ఉన్నది వాడరాదు.
  • శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో మనుష్యులు నడవరాదు.
  • ఉదయం ,సాయంకాలం రెండు సార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోండి.
  • తులసి దళములను పూజ చేయునపుడు దలములుగానే వెయ్యాలి.ఆకులుగా త్రుంచిన దోషము. మరు జన్మలో భార్యా వియోగము కలుగును. ఏ పుష్పములు అయినా త్రుంచి,ఆకులతో పూజించిన భార్యాభర్తలకు వియోగము సంభవించును.
  • తాకుట వల్ల దోషము లేనివి:(అంటే అంటూ కానివి) తీర్దయాత్రలందు, పున్యక్షేత్రములందు, దేవాలయములందు,మార్గమునందు,వివాహమునండు,సభలందు,పడవలు,కార్లు,రైళ్ళు,విమానాలు మొదలగు వాహనాలలో ప్రయానమందు స్పర్శ దోషం లేదు.
  • ఆదివారం సూర్యుని ఆలయం, సోమవారం శివుడు(మరియు)గౌరిమాత ఆలయం, మంగళవారం) ఆంజనేయస్వామి,సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు,బుధవారం వినాయకుడు మరియు అయ్యప్పస్వామి ఆలయాలు, గురువారం సాయిబాబా, దత్తాత్రేయ,వెంకయ్యస్వామి మొదలగు గురువుల ఆలయాలు, శుక్రవారం అమ్మవారి ఆలయాలు, శనివారం వెంకటేశ్వరస్వామి ఆలయాలు మరియు గ్రామదేవతల ఆలయాలు వారి వారి సంప్రదాయసిద్ధంగా దర్శించుట మంచిది.
  • ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. శివాలయమునకు వెళ్ళినపుడు మొదట నవగ్రహాలను దర్శించి , ప్రదక్షిణాలు చేసి, కాళ్ళు కడుగుకొని తరువాత శివ దర్శనం చేసుకోవాలి. అదే విష్ణు ఆలయాలు (అనగా రాముడు,కృష్ణుడు,వెంకటేశ్వరస్వామి) దర్శించినపుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతావారిని దర్శించాలి. మొదట పాదములను చూసి,తరువాత ఆపాదమస్తకము దర్శించాలి.
  • నవ విధ భక్తి మార్గములు: శ్రవణం (వినటం), కీర్తనం(పాడటం), స్మరణము(మనసులో జపించుట), పాద సేవనము, అర్చన(పూజ), నమస్కారము, దాస్యము(సేవ), సఖ్యము, ఆత్మనివేదనము(మనోనిగ్రహముతో సమర్పించుట) వీటిలో ఏ పద్ధతి ఐనను దేవునికి ప్రీతికరము.
  • జపములు మూడు రకములు.అవి: (ఏ) వాచకజపము:అందరికి వినపడేలా బిగ్గరగా చేసేది. (బి) ఉపామ్సుజపం:ఎవరికి వినపడకుండా పెదాలను కదుపుతూ చేసేది. (సి) మానసజపం: ఎవరికి వినపడకుండా , పెదాలు కదపకుండా, మనసులో చేసేది. అన్ని జపాలలో కెల్లా మానసజపం ఉత్తమం,వాచకజపం సామాన్యం,ఉపంసుజపం మధ్యమం.
  • స్త్రీలు ఓంకారాన్ని జపించకూడదు.
  • ప్రదక్షిణాలు: వినాయకుని ఒకటి,ఈశ్వరునికి మూడు, అమ్మవార్లకు నాలుగు,విష్ణు మూర్తికి నాలుగు,మర్రిచేట్టుకి ఏడు ప్రదక్షిణాలు చెయ్యాలి
Credit: Chaganti Koteshwararao Garu


Read More

Sunday, February 01, 2015

Mana Kamareddy

నదులకు హారతి ఎందుకిస్తారో తెలుసా ?

త్వరలో గోదావరి పుష్కరాలు వస్తున్న నేపథ్యంలో మీ కోసం మన కామారెడ్డి అందిస్తోంది

నదులకు హారతి  ఎందుకిస్తారో తెలుసా ?
రక్షించిన వారిని అమ్మగా చూడాలనిచెబుతుంది భారతీయ సంస్కృతి.నదులు ఎన్నిరకాలుగా ఉపయోగపడతాయో, నిజానికి అందులో పదోవంతు కూడా ఒకమనిషి మరో మనిషికి ఉపయోగపడడం లేదు. కానీ, వీరందరికీ నదీమతల్లులు ప్రాణాలను నిలుపుతున్నాయి. ఆహారంతో పోషిస్తున్నాయి. ఇతర దేశాలలోని వారు నీళ్ళను నీళ్ళుగా మాత్రమే చూస్తారు. కానీ మనం! గంగానదిని గంగామాత అంటాం. గోదావరి నదిని గోదావరి మాత అంటాం అలాగే కృష్ణా నదిని కృష్ణమ్మ తల్లి అంటాం. ఏ నదినీ మనం తక్కువ చేసి చూడం. ఆ నదులలో పారే నీటికి హారతి పడతాం. ఎందుకిలా అని అనేకమంది ప్రశ్నిస్తారు. సమాధానం సుస్పష్టమే. ఈ భూమిపై ప్రసరించే సౌరశక్తిని మానవులు, జంతువులూ, నదీనదాలు స్వీకరిస్తాయి. అయితే, మానవులు ఈ శక్తిని కేవలం తమకోసం మాత్రమె స్వీకరిస్తారు. చెట్లు సౌరశక్తిని తమతో పాటు మానవులకు, జంతువులకూ కూడా ఉపయోగపడే స్థాయిలో స్వీకరిస్తాయి. ఇక నదులు స్వీకరించే సౌరశక్తిని మానవులు, పశుపక్ష్యాదులు, జంతుజాలం, చెట్టూచేమా, భూమి అన్నీ వినియోగించుకుంటాయి. ఇక పూర్ణిమ రోజున సూర్యుడి శక్తి చంద్రుడి ద్వారా నదులకు పూర్తీ స్థాయిలో లభిస్తుంది. అలాంటి నదీమ తల్లులకు హారతి పట్టడానికి వెళ్ళినప్పుడు ఆ నదీ జలాన్ని మనం స్పరించక మానం. సూర్యచంద్రుల నుంచి లభించే ఈ అద్వితీయ శక్తిన్ ఆ నదులు మనకు అందించేందుకు పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్నాయి. ఏతావాతా ఒక్క కార్తిక పూర్ణిమ రోజునే కాకుండా ప్రతి పూర్ణిమకూ నదులను సేవించవలసిన అవసరం మనకుంది. ఈ విషయాలన్నింటిని బట్టి భారతీయుల విజ్ఞతను ప్రపంచంలోని వివేకవంతులందరూ గుర్తిస్తున్నారు.

నాసిక్ నుంచి అంతర్వేది వరకు ప్రవహించే గోదావరి నీరు ఆంధ్రప్రదేశ్ లో సుమారు 6జిల్లాల భూమాతకు స్నానం గావిస్తున్నాయి. 10కోట్లమంది ప్రాణాలకు ఆధారంగా నిలుస్తున్నాయి. ఈ నదులను ఏడాది పొడవునా పవిత్రంగా కాపాడుకోవలసిన అవసరాన్ని ఈ హారతి చాటి చెబుతుంది. నదీమతల్లికి హారతి ఇవ్వడమంటే ప్రత్యక్షంగా పర్వావరణ పరిరక్షణకు తోడ్పడటమే. పూజించే దానిని మనం పవిత్రంగా చూసుకుంటాం. అందుకే ఇది కేవలం వ్యక్తులు చేస్తే సరిపోదు. ప్రభుత్వమే ఈ కార్యాన్ని చేపట్టాలి. సుదీర్ఘ చర్చలు, తీవ్ర వత్తిడులతో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు రాష్ట్రంలోని అన్ని నదీజలాలకూ హారతి పట్టాలంటూ ప్రభుత్వ ఉత్తర్వును జారీచేయడం హర్షణీయం. ఈ ఏడాదిలో అటు గోదావరి, ఇటు కృష్ణా నదులకు హారతులు పట్టే కార్యక్రమాలు వివిధ ప్రాంతాలలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఇది ఎంతో సంతోషకరమైన పరిణామం. ఈ హారతులను కేవలం కార్తిక పూర్నిమకే పరిమితం చేయకుండా, ప్రతి పూర్ణిమ నాడు నదులకు విశేష హారతినిచ్చేలా ప్రభుత్వ ఉత్తర్వులను పొడిగించాలి.


Read More

Friday, January 30, 2015

Mana Kamareddy

మహాభారతం కేవలం కట్టుకధ కాదు అని చెప్పటానికి ఆధారం ఇదే..

మహాభారతం కేవలం కట్టుకధ కాదు అని చెప్పటానికి పురావస్తు ఆధారాలు, శాసనాలు దొరికాయి. వాటిలో ప్రధానమైనది ద్వారక. శ్రీ కృష్ణపరమాత్ముడి అద్భుత నగరం, 5000 ఏళ్ళ క్రితం భారత్‌లో ఉన్న నైపుణ్యానికి, సాంకేతికపరిజ్ఞానానికి నిలువుటద్దం.
1980వ దశకంలో గుజరాత్‌ సముద్ర తీరంలో జరిగిన పరిశోధనలు భారతీయ చారిత్రక నిర్మాణంలో అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించాయి, కుట్రపూరిత బ్రిటీష్ చరిత్రకు సవాల్ విసిరాయి. శ్రీ కృష్ణుడి ఉనికి అబద్దమంటూ వస్తున్న ప్రచారాలకు గట్టి సమాధానం ఇచ్చాయి. భారత పురావస్తు పరిశోధనా సంస్థ, జాతీయ సముద్రగర్భ శాస్త్ర సంస్థల సంయుక్త పరిశోధన జరపాలని జడ్.డి.అన్సారీ, ఎమ్.ఎస్.మతే ప్రతిపాదించారు. దీని ద్వారా డాక్టర్ ఎస్.ఆర్.రావు ఆధ్వర్యంలో చెప్పుకోదగిన కృషిజరిగింది. ఆ పరిశోధనల్లో భాగoగా గుజరాత్ పశ్చిమాన గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతంలో సాగర గర్భంలో ఒక మహానగరం బయటపడింది.. మహాభారత కాలాన్ని, శ్రీకృష్ణుడి ఉనికిని ఈ నగరం బయటి ప్రపంచానికి చాటి చెప్పింది.. ఇదే ఇవాళ మనం చెప్పుకుంటున్న ద్వారక.అదే విశ్వకర్మ నిర్మించిన ద్వారక..

192 కిలోమీటర్ల పొడవు,192 కిలోమీటర్ల వెడల్పు, 36864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం తో బారులు తీరిన వీధులు, వీధుల వెంట బారులు తీరిన చెట్లు, రాయల్‌ ప్యాలెస్‌లు, రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లు, కమర్షియల్‌ మాల్స్‌, కమ్యూనిటీ హాల్స్‌, వాటర్ ఫౌంటేయిన్లు..ఒకటేమిటి క్రీస్తుపూర్వం మూడు వేల సంవత్సరాల నాడే అపూర్వ మహానగరం రత్నస్తంభాలు, వజ్ర తోరణాలు, సాటిలేని వాస్తు/శిల్ప కళా నైపుణ్యంతో సముద్రం మధ్యలో జరిగిన మహా నిర్మాణం..అదే జగన్నాథుడి జగదేక సృష్టి..క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నాటి ద్వారక ఇప్పుడు సాగర గర్భంలో నిజంగా మన నాగరికత, మన సంస్కృతి, మన హిందూ ప్రతిభకు పట్టం కట్టిన నాటి కాస్మోపాలిటన్‌ సిటీ.
1983 నుంచి 1992 వరకు 12 సార్లు సాగరాన్ని మధించారు. ఫలితంగా నాటి ద్వారకకు చెందిన వస్తువులు సేకరించి ఫిజికల్ రిసెర్చి లేబొరేటరీకి పంపారు. అక్కడ 'థెర్మోలూమినెసెన్స్', 'కార్బన్ డేటింగ్' వంటి అత్యాధునికపరీక్షలు జరిగాయి. అవన్నీ ద్వారాకలో దొరికిన వస్తువులు ఖగోళశాస్త్రవేత్తలు లెక్కకట్టిన మహాభారత సమయానికి సరిగ్గా సరిపోతున్నాయి. ఏవో రెండు, మూడు వస్తువులు దొరికితే ఫర్వాలేదు, ఏకంగా ఒక మహానగరమే సాగర గర్భంలో దొరికింది.అదే హిందు మతం యొక్క గొప్పతనం ...ఈలాంటి విషయాలను నేటి తరానికి చెప్పవలసిన అవసరం ఎంతైనా వుందని కోరుకుంటూ మీ మన కామారెడ్డి.

పరిశోధకులు కనుగొన్న ద్వారకా మహా నగరం లో తీసిన ఫోటోలు...
Dwaraka Overview (Graphical)

 నిజమైన దృశ్యాలు










Read More

Friday, October 24, 2014

Mana Kamareddy

నాటి కోడూరు - నేటి కామారెడ్డి

నాటి కోడూరు - నేటి కామారెడ్డి



Read More

Wednesday, June 04, 2014

Mana Kamareddy

Kamareddy MLA's From 1952 to 2014

Kamareddy MLA's From 1952 to 2014




Read More

Thursday, May 22, 2014

Mana Kamareddy

గుళ్ళల్లో ప్రసాదం పెడతారు ఎందుకు?



గుళ్ళల్లో ప్రసాదం పెడతారు ఎందుకు?
   సహజంగా మేము తిరుపతి వెళ్లి వచ్చాము అనో, శబరి మలై వెళ్లి వచ్చామనో ప్రసాదం పెడితే కొంతమంది తీసుకోరు. పైగా మేము ప్రసాదం తినము అని అదేదో గొప్ప పని చేసినట్టుగా గొంతు పెట్టి చెప్తారు. అసలు గుళ్ళల్లో ప్రసాదం ఎందుకు పెడతారు, కేవలం అది భక్తితోనేనా లేక మరేదైనా కారణం ఉందా అని ఆలోచిస్తే మనకు ఒక అద్భుతమైన విషయం బోధ పడుతుంది. మరే వ్యవస్థలో లేని సోషలిజం మనకు ఈ ప్రసాద వితరణ లో కనపడుతుంది. అదేదో ఊరికే నైవేద్యం పెట్టి మనం లాగించడానికి కాదు అనే తత్వం బోధపడుతుంది. 
     
ఒక ఊరి లో ఉండే ప్రజలందరూ మంచి పౌష్టికాహారం తీసుకునే స్థితిలో ఉండరు. బాగా డబ్బులున్న వాళ్ళు పేదవాళ్ళ గురించి పట్టించుకోరు. వారికి కూడా మీరు తినే బలమైన ఆహారం పెట్టండి అంటే ఎవరూ ముందుకు రారు. అదే దేవుడికి ప్రసాదం చేయించండి, మీకు పుణ్యం వస్తుంది అంటే సంతోషంగా ఒప్పుకుంటారు. అలా చేయించిన పౌష్టికాహారాన్ని దేవుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం పేరుతో అన్ని వర్గాల వారికి అందించడం ప్రసాద వితరణ వెనుక ఉన్న అసలు రహస్యం. మనం తీసుకునే పులిహోర, దద్దోజనం, చక్ర పొంగలి, సెనగలు, కట్టె పొంగలి మొదలైన వాటిల్లో ఇనప ధాతువు (ఐరన్), కార్బో హైడ్రేట్లు, కాల్షియం, పీచు పదార్థాలు, సోడియం, పొటాసియం, ఇంకా అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి. 

కాబట్టి ప్రసాదం పెట్టడం ద్వారా ఊరి లోని జనాలందరినీ బలంగా, ఆరోగ్యంగా ఉంచాలి అనేది మన పెద్ద వాళ్ళ ఉద్దేశ్యం.


Read More