Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks
Showing posts with label Editorial. Show all posts
Showing posts with label Editorial. Show all posts

Sunday, August 16, 2015

Mana Kamareddy

'శ్రీమంతుడు' చిత్రం గురించి కొన్ని మంచి మాటలు: ఎడిటోరియల్

కొరటాల శివ దర్శకత్వంలో, మహేష్ బాబు హీరో గా వచ్చిన శ్రీమంతుడు సినిమా గురించి కొన్ని మంచి మాటలు...తను జన్మించిన ఊరి కోసం ఒక శ్రీమంతుడి కొడుకు ఏం చేస్తాడో దర్శకుడు చాల చక్కగా తెరకెక్కించాడు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలైతే హృదయాన్ని తాకుతాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రస్తుత కాలంలో పట్టనీకరణలో  భాగంగా గ్రామాల నుండి పెరిగిపోతున్న వలసలను, గ్రామల ప్రజల కష్టాలను రాజకీయ అంశాలతో ముడి పెట్టి చాల బాగా చూపించాడు దర్శకుడు. సినిమాలో కథ మొత్తం వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలోని దేవరకోట అనే గ్రామం చుట్టూ తిరుగుతుంది.


శ్రీమంతుడు చిత్రంలో పల్లెటూరులో పుట్టిపెరిగి కొన్ని కారణాల వల్ల పుట్టిన ఊరిని వదిలిన ఒక శ్రీమంతుడి  కొడుకుగా హీరో మహేష్ బాబు పోషించిన పాత్ర యువతకి నిజంగా స్పూర్తిగా నిలుస్తుంది. దానికి తోడు అన్న తమ్ములమద్య వుండే అనురాగాన్ని, ఆప్యాయతని కూడా చక్కగా చూపించారు. కొడుకు కోసం తన వుమ్మడి కుటుంబాన్ని వదిలి ముఖ్యంగా తన అన్నని, తన ఊరుని వదిలి పెట్టి పోవాలనుకున్న వ్యక్తి భార్యతో హీరో అన్న ఈ క్రింది మాటలు, సొంత ఊరు (పల్లెటూరు) ప్రాముఖ్యత హృదయానికి తాకుతుంది.

పట్టణాల్లో ఇంట్లో నిలబడి చూస్తే బయట నాలుగు పెద్ద మేడలు, పల్లెటూరు కంటే నాలుగు గంటలు ఎక్కువగా కరెంటు వుంటది.. కాని నీతో మాట్లాడటానికి నీచుట్టూ పక్కల మాత్రం ఎవరు వుండరు...అదే ఊర్లో ఐతే ఎంత మంది ఉన్నారు  చూడు...!!


తన కొడుకు ఊరులో ఉండకూడదని, వుంటే హాని అని తన ఇంటికి తీసుకువచ్చిన ఒకశ్రీమంతుడి కొడుకు తన తండ్రి తో అన్న ఈ క్రింది మాటలు..గ్రామాలలో జన్మించిన ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతయనటంలో ఏమాత్రం సందేహం లేదు.

నన్ను ఊరి నుండి తీసుకొచ్చారు కాని నా నుండి ఊరిని వేరు చేయలేరు..!!

ఆలాగే తన ఊరికి సేవ చేయటానికి తన తల్లి తండ్రులకు దూరంగా వెళ్తున్న ఒక యువకుడు తన తండ్రి తో ఉద్వేగంతో అన్న ఈ క్రింది మాటలు కూడా ఎంతో స్ఫూర్తి కి కలిగిస్తాయి.

ఈ జన్మకు ఇంతవరుకు చాలు నాన్న, నేను ఊరికి మంచి చేయటానికి వెళ్తున్న..మళ్ళి జన్మంటూ వుంటే నీకు కొడుకుగా పుడతా..

మొత్తానికి చిత్రంలోని చాల సన్నివేషాలు ..గ్రామాలలో (పల్లెటూర్లలో) జన్మించిన ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. సినిమాని కేవలం సినిమాలానే చూడకుండ అందులోని కొంత మంచిని కూడా గ్రహించాలన్నదే మన కామారెడ్డి పోర్టల్ ఉద్దేశం. వృత్తి రీత్యా లేదా వ్యాపారం రీత్యా గ్రామాల నుండి వెళ్ళి పట్టణాల్లో, విదేశాలలో స్థిర పడిన వారెవరైనా వారి వారి స్థోమతకు తగిన విధంగా ఎంతో కొంత తమ తమ గ్రామాలకు సేవ చేయాలని కోరుకుంటూ...

- ఎడిటర్ (మన కామారెడ్డి)





Read More

Sunday, August 09, 2015

Mana Kamareddy

ఆసియా ఖండంలోనే పరిశుభ్రమైన గ్రామంగా తమ్నాథ్ (మహారాష్ట్ర)

న దేశంలో చాల గ్రామాలు పరిశుభ్రంగా ఉండవు అనే మాటలను అసత్యం చేస్తూ ప్రపంచానికి ముఖ్యంగా మన దేశానికి ఆదర్శంగా నిలిచింది మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో ఉన్న తమ్నాథ్ అనే గ్రామం. ఈ సంవత్సరానికి గాను ఆసియా ఖండంలోనే పరిశుభ్రంగా ఉన్న గ్రామాల జాబితాలో మొదటి స్థానంలో అలాగే  ప్రపంచంలోనే ఐదవ స్థానంలో నిలిచింది ఈ గ్రామం.

పెద్ద నగరాల్లో ధనిక వర్గాలు జీవించే ప్రాంతాల ఊహకందని విధంగా గ్రామంలో పారిశుద్యానికి సంభందించిన వివిధ సౌకర్యాలు సమకూర్చుకోవటం, సరైన పద్దతులలో వ్యర్థ పదార్థాల నిర్వహణ లాంటి కార్యాక్రమాలే ఆ గ్రామాన్ని ఈ స్థాయిలో ఉండేలా చేసింది. విచిత్రమమేటంటే మాకు పరిశుభ్రత తర్వాతే దైవభక్తి, ఇదే మా విజయానికి కారణం అంటారు అక్కడి గ్రామ ప్రజలు.

సగటున తక్కువ ఆదాయం ఉన్న ప్రజలు ఎక్కువగా నివసించే ఆ గ్రామంలో, గ్రామ ప్రజల ఐఖ్యత, అత్యాధునిక సౌకర్యాల సమీకరణ, మరుగుదొడ్లు నిర్మించుకోవటానికి తగిన రాయితీలు ప్రకటించటం అలాగే ఇంటి బయట చెత్త వేయకుండా తగిన చర్యలు తీసుకోవటమే ఆ గ్రామ ప్రజల విజయ రహస్యం.

మన దేశంలో ఉన్న ప్రతి గ్రామం ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోని మన దేశాన్నిపరిశుభ్రమైన దేశంగా మార్చవలసిన అవసరం ఉంది.

తమ్నాథ్ గ్రామానికి సంబంధించిన కొన్ని చిత్రాలు మీకోసం..




Read More

Wednesday, August 05, 2015

Mana Kamareddy

రామాయణ మహాభారతలలోని కొన్ని ఘట్టాలతో, బాహుబలి చిత్రానికి ఉన్న కొన్ని పోలికలు..

ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన దృశ్య కావ్యం బాహుబలి చిత్రంలోని కొన్ని సన్నివేశాలకు , భారతీయ పురాణ ఇతిహాసాలైన రామాయణ మహాభారతాలలోని కొన్ని ఘట్టాలకి చాలా దగ్గరి పోలికలున్నాయి. చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చాలా ఇంటర్వ్యూ లలో తన చిత్రానికి ఆదర్శం రామాయణం, మహాభారతం అని చెప్పినట్లుగా దగ్గరి పోలికలున్న కొన్ని సన్నివేశాలు మీకోసం ...


వాసుదేవుడు, శ్రీ కృష్ణుడిని మథుర నుండి గోకులానికి చేరవేయుట..


శ్రీ కృష్ణుడు చెరసాలలో జన్మించినపుడు, అతనికి తన మేన మామాయిన కంసుని వల్ల  ముప్పు ఉన్నందున, గోకులంలో వున్న యశోదకు కుమారుడిగా ఉండటానికి వాసుదేవుడు మథుర నుండి యమునా నది గుండా గోకులంలో ఉన్న నందుడు అనే మహారాజు వద్దకు తీసుకెళ్తాడు.


బాహుబలి చిత్రంలో అమరేంద్ర బాహుబలి కుమారుడైన మహేంద్ర బాహుబలిని, బల్లాలదేవ బారినుండి రక్షించటానికి  శివగామి ఒక సొరంగం ద్వారా నదికి దాటుతుంది. ఆ తర్వాత ఆ బాలున్ని అక్కడ గ్రామస్తులచేత రక్షించబడి సంగా అనే మహిళకు కొడుకుగా 'శివ' అనే పేరుతో పెద్దవాడౌతాడు.

హనుమంతుడు సీత దేవి కాపాడుతానని చెప్పటం..



అశోకవనంలో రావణుని చెరలో వున్నా సీత దేవి వద్దకు హనుమంతుడు వచ్చి నమస్కరించి సీతను రక్షించటానికి ఆజ్ఞ కోరుతాడు. సీత దేవి తిరస్కరించి నా భర్త శ్రీ రామచంద్రుడు వచ్చి ఈ చెడ్డ మనస్కుడైన రావణున్ని సంవరించిన తర్వాతే ఇక్కడి నుండి వస్తానని చెబుతుంది.

బాహుబలి చిత్రంలో బల్లాలదేవా బారినుండి దేవసేనను రక్షిస్తానని,అందుకొరకు అంగీకారం కోసం ప్రార్థించిన కట్టప్పతో దేవసేన నా కుమారుడు మహేంద్ర బాహుబలి వచ్చి బల్లాల దేవను శిక్షించిన తర్వాతే ఇక్కడి నుండి వస్తానని అతని ప్రార్థనను తిరస్కరిస్తుంది.


అశోకవనంలో రావణుడు, సీతాదేవి తో మాట్లాడుట..


అశోక వనంలో రావణుడు, సీత దేవి వద్దకు వచ్చి తనను వివాహం చేసుకొని లంకకు మహారాణి గా సుఖ జీవితం అనుభవించమని కోరినపుడు..సీత దేవి రావణుడి వంక చూడకుండా త్వరలోనే నా భర్త తప్పకుండ ఎక్కడికి వచ్చి నిన్ను శిక్షిస్తాడని చెబుతుంది.

బాహుబలి చిత్రంలో మాహిష్మతి సామ్రాజ్యంలో బందీగా వున్న దేవసేనతో బల్లాలదేవా, అమరేంద్ర బాహుబలిని తన భర్తగా నిరాకరించమని కోరుతాడు. ఆ తర్వాత కట్టప్ప తో దేవసేన ఇలా అంటుంది..నా కొడుకు వస్తాడు వచ్చి నేను పెరుస్తున్న చితి వద్దకు మృగాడైన బల్లాలదేవను ఇడ్చుకెళ్ళి మసి చేసి మరి నన్ను రక్షిస్తాడని చెబుతుంది.

హనుమంతుడు లంకకి నిప్పు పెట్టటం..


సీతాదేవిని రక్షించటానికి వచ్చిన హనుమంతుడు, సీతాదేవి కనబడగానే..రావణుడికి బుద్ది చెప్పటంకోసం లంకకి నిప్పు పెడతాడు. ఆ సమయంలోనే రావణుడి కుమారుడైన అక్షయ కుమారుడిని సంహరిస్తాడు.

బాహుబలి చిత్రంలో దేవసేనను రక్షించటానికి వచ్చిన మహేంద్ర బాహుబలి మాహిష్మతి సామ్రాజ్యంలోని రాజభవనంలో నిప్పు పెట్టి ఆ తర్వాత బల్లాలదేవా కొడుకుని చంపేస్తాడు.

మథుర పై దండెత్తిన కలయవనుడు..

మహాభారతంలో కాలయవనుడు సుమారు మూడు కోట్లమంది సైన్యంతో మథురపై దండెత్తుతాడు. ఆ సమయంలో ఎవరికీ అర్థం కాని భాషలో మాట్లాడుతూ, కనీస యుద్ధ నియమాలు లేకుండా కలయవనుడి సైన్యం ఎక్కడికక్కడ విద్వంసం సృష్టిస్తారు.

బాహుబలి చిత్రంలో కాలకేయుడు తన సైన్యంతో మాహిష్మతి సామ్రాజ్యం పై దండెత్తుతాడు. ఆ సమయంలో
ఎవరికీ అర్థంకాని భాషలో మాట్లాడుతూ, కనీస యుద్ధ ధర్మాన్ని పాటించకుండా విద్వంసం సృష్టించటానికి ప్రయత్నిస్తాడు.


బాహుబలి చిత్రంలో యువరాజుని చంపింది అమరేంద్రబాహుబలి కుమారుడైన మహేంద్రబాహుబలి అని తెలిసి యుద్ధ బానిసైన కట్టప్ప అతని ముందు లొంగిపోతూ మహేంద్ర బాహుబలి పాదాన్ని తన నుదిటి పై పెట్టుకుంటాడు. ఈ సన్నివేశం మన పురాణాల్లో వున్న మహబలి మరియు వామనదేవుడిని గుర్తుచేస్తుంది.



ఆర్టికల్ క్రెడిట్: ఎడిటర్, మన కామారెడ్డి 


Read More

Thursday, June 25, 2015

Mana Kamareddy

మన ప్రాంతంలో మిషన్ కాకతీయ పనులు ఎలా జరుగుతున్నాయి?


మిషన్ కాకతీయ  పథకంలో కొన్ని ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా చాల ప్రాంతాల్లో వున్నాయి, కాని చాల వరకు వెలుగులోకి రావటంలేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆయకట్టు భూములు అతి తక్కువగా వున్న కొన్ని చెరువులను కూడా మిషన్ కాకతీయ పథకం క్రింద చేర్చి కొందరు ప్రజా ప్రతినిధులు డబ్బులు దండుకుంటున్నారు అనే వార్తలు ప్రజల్లోనుండి వస్తున్నాయి.  ఈ పథకంలో భాగంగా చెరువులతో పాటు వాటిని కలుపుతూ పోయే కాలువలను కూడా మరమ్మత్తు చేస్తే చాల ఉపయోగంగా వుంటుంది. ప్రజలకు మేలు చేసే ఈలాంటి పథకంలో మాత్రం ఆరోపణలు మన ప్రాంతం నుండి రావొద్దని కోరుకుందాం. ఒకవేళ మీ దృష్టికి ఏమైనా వస్తే మాకు షేర్ చేయగలరు.
ఈ క్రింద కనిపిస్తున్న సంఘటన (ఆర్టికల్) మన ప్రక్కన ఉన్న కరీంనగర్ జిల్లాలో జరిగింది.
Click on image for bigger view



Read More

Saturday, May 30, 2015

Mana Kamareddy

తెలంగాణా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై తెలంగాణా కవి డా.అందేశ్రీ గారి మాటల్లో..


నూతనంగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై 
తెలంగాణా కవి డా.అందేశ్రీ గారి మాటల్లో... 

ర్తమానం, నిద్రావస్థ లోకి జారిపోతున్న జాతి జాగ్రతవస్థ మౌనానికి లోనవుతుంది 
శబ్దం పుట్టుక కొరకు శివాలు ఎత్తిన కంటాలకు పక్షవాతము పట్టుకున్నట్లు ఉంది. 
ఎక్కడ చూసినా మౌనం, మౌనం.. 
నా తెలంగాణాకు మట్టికి పట్టిన చీడ నిన్నటి దిక్కారం దిగంతాలను దాటింది, 
మరి ఇప్పుడు ఏమి ఏమౌతుంది ?? వెక్కిరింతలకు లోను అవుతుంది ,
పుట్టెడు కష్టాల పుట్టి మునిగి పోయింది.
తెలంగాణా కన్నీళ్ళకు, కడగల్లకు తెర తోలిగిపోయినట్టేనా?
తెలంగాణా విముక్తి కోసము పండుటాకుల్ల రాలిన అమరత్వపు, స్థూపానికి, దీపానికి దిక్కే లేకుండా పోతుంది. క్షేత్రాన్ని వదిలిపెట్టిన యోధున్ని, యుద్దము లో అలిసిపోయి వెనుతిరిగిన సైనికున్ని చరిత్ర ఎప్పుడు క్షమించదు. సామ్రని పొగలు వేసుకోవడము ,చేతికి అందిన సెంట్లు పుసుకోవడము సేద తిరినట్టు అవుతుందా ? నిప్పులు గక్కిన మలి దశ తెలంగాణా ఉద్యమ అస్థిత్వానికి చదలు పట్టినట్టు అవుతుందా? సమూహంగా కదిలినప్పుడే కదా విజయానికి చేరువయినాము, సామజికంగా వేరు అవుతూ, సమిష్టికి దూరము అవుతుంటే పలసన అయిపోమా? యుద్దము ముగిసిపోయింది అనా.. వర్త్ధమానము అంత నిశబ్దము?? ప్రశ్నిoచమని పలికిన నాలుకలే ప్రణాళిక బద్దంగా సంధి కోసం తలోగ్గుతున్నాయి, రాచరికపు పడుపు కూడు కోసము అమ్మ నిన్ను ఆమ్మను అని ప్రకటించుకొన్న పోతన మహత్యులు ఈ పొద్దున్న లేరు అనుకోవద్దు , నిక్కచ్చిగా బతుకాలి అని ఎ కవికి ఉండదు? నిక్కచ్చిగా బతుకలి అని ఎవ్వరికి ఉండదు? తన లోని అత్యాశే ఆ కవిని హత్య చేస్తుంది. నిటారుగా బ్రతుకాలి అని కోరుకోవడము దురాశేమి కాదు , ఉపరితలము భ్రమలే ఉపిరి సలుపుకోనివ్వడము లేదు ,ఆకలి ప్రపంచాన్ని నిర్మించింది ,ఆశ విశ్వ వ్యాప్తమై చిగురున్చింది. తన ఉనికిని, ఉహని ,మహోన్నత శిల్పంగా చెక్కు కున్న నైపుణ్యత మీ సేవ లో నిర్జీవం అయిపోవాలా? అక్షరం ఎప్పుడు అక్షయ పాత్రగానే ఆదుకుంటుంది, అమ్మకానికి నిలపడ్డప్పుడే సంత లో సరుకు అయిపోతుంది. శిఖరం తానే అయి, లోయ తానే అయి బ్రతకనేర్చిన మనిషిని ప్రశ్నoచడం ఎందుకు ? అంత ప్రశ్నార్ధకమే ! ఇది కవి వాక్కు, గాలి లో కలిసిపోయిందా గమనాలని నిర్మాణం చేస్తది , జనం లో నిలిచిపోయిందా కాలజ్ఞనం అయి నిలదిస్థది  - డా.అందేశ్రీ


అందేశ్రీ గారి మాటలను జాగ్రత్తగా చదివితే మన తెలంగాణా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయి. అందేశ్రీ గారి మాటలు గనుక చదివితే తెలంగాణా ఉద్యమంలో అమరులైన అమరవీరుల ఆత్మలు కూడా ఎంత ఘోషిస్తాయో మరి. 

జనం నాడి కవికి అందులో జానపదకవికి మాత్రమే తెలుస్తుంది అనటానికి పై మాటలు నిదర్శనం..హాట్స్ హాఫ్!!




Read More

Wednesday, December 17, 2014

Mana Kamareddy

వాళ్ళని అల్లా కూడా క్షమించడు..!!

పాము ను పాలు పోసి పెంచితే అది చివరికి పోషించిన వాడినే కాటు వేస్తుంది అనటానికి మంచి ఉదాహరణ
అక్కడి పాలకులు చేసిన పాపానికి ఏమి తెలియని చిన్నారులు ఎందుకు బలి కావాలి?

పాకిస్తాన్ లోని పెషావర్ పట్టణం లో తాలిబాన్ల కాల్పులలో తీవ్రంగా గాయపడిన షారుక్‌ఖాన్‌ అనే విద్యార్ధి మనోగతం  మీ కోసం..

మేమందరం కెరీర్‌ గైడెన్స్‌ సెషన్‌లో భాగంగా స్కూల్‌ ఆడిటోరియంలో ఉండగా.. పారామిలటరీ యూనిఫాంలు, తుపాకులు ధరించిన నలుగురు లోపలికి చొరబడ్డారు. వెంటనే ఎవరో ‘అందరూ బెంచీల కింద దాక్కోండి’ అని అరిచారు. ఆ దుండగులేమో.. ‘అల్లాహు అక్బర్‌’ అని గట్టిగా అరుస్తూ విచక్షణ రహితంగా కాల్పులు మొదలుపెట్టారు. అంతలో, వారిలో ఒకడు.. ‘చాలామంది బల్లల కింద ఉన్నారు. వారినీ కాల్చేయండి’ అని అరిచాడు. అప్పటికే నా రెండు మోకాళ్లకింద బుల్లెట్లు దిగాయి. నొప్పిని భరిస్తూ బెం చీ కింద దాక్కున్నాను. కొద్దిగా కళ్లు తెరిచి చూస్తే నల్లటి బూట్లతో ఒకడు రావడం కనిపించింది. దాంతో నేను చనిపోయినట్టు నటించాలనుకున్నాను. బాధతో అణచుకోవడానికి నా టైని మడతపెట్టి నోట్లో కుక్కుకున్నాను. ఆ వ్యక్తి ఎవరైనా బతికున్నట్టు కనిపిస్తే వారి శరీరాల్లోకి తూటాలు దించుతున్నాడు. నేను వీలైనంత స్థిరంగా, కదలకుండా పడుకున్నాను. కళ్లు గట్టిగా మూసుకుని.. మరోసారి నాపై కాల్పులకు సిద్ధమై వేచి చూడసాగాను. కానీ.. నా శరీరం వణికిపోతోంది. చావు నన్ను సమీపిస్తున్నట్లనిపించింది. నేను చావును ఎంత దగ్గరగా చూశానంటే.. నా జీవితంలో ఎప్పటికీ నన్ను సమీపిస్తున్న ఆ నల్లటి బూట్లను మర్చిపోలేను. అయితే, ఆ వ్యక్తి కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నేను కొద్దినిమిషాలపాటు అక్కడే కదలకుండా పడుకుండి పోయాను. ఆ తర్వాత పైకి లేవడానికి ప్రయత్నించాను. కానీ.. గాయాలవల్ల కింద పడిపోయాను. పాకుతూ పక్క గదివద్దకు వెళ్లాను. అక్కడ పరిస్థితి భయానకంగా ఉంది. మా స్కూలు ఆఫీస్‌ అసిస్టెంట్‌ మృతదేహం కాలిపోతూ కనిపించింది. కుర్చీలో కూర్చున్న ఆమె, కూర్చున్నట్టే ఉంది. కాలిపోతున్న శరీరం నుంచి రక్తం కారుతోంది. మా బడిలోనే పనిచేస్తున్న మరో సైనికుడి మృతదేహాన్ని కూడా చూశాను. అక్కణ్నుంచీ నెమ్మదిగా పాక్కుంటూ వెళ్లి తలుపుచాటున దాక్కున్నాను. అంతే.. స్పృహ తప్పింది. కళ్లు తెరిచేసరికి ఆస్పత్రిలో ఉన్నా..చావు అంటే ఏంటో దగ్గరి నుండి  చుసాను.. వాళ్ళని అల్లా కూడా క్షమించడు...వాళ్ళని నిజంగా అల్లా కూడా క్షమించడు..అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు..

దేశం ఏదైనా మతం ఏదైనా చిన్నారులు దేవుళ్ళతో సమానం అంటారు..అక్కడ మరణించిన చిన్నారుల ఆత్మ కి శాంతి చేకూరాలని అల్లా ని ప్రార్థిస్తూ..విశాల హృదయం తో   

-మన కామారెడ్డి 




Read More