Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks
Showing posts with label Kamareddy District. Show all posts
Showing posts with label Kamareddy District. Show all posts

Wednesday, October 05, 2016

Mana Kamareddy

Telangana 31 Districts list revealed..


Telangana Government decided to reorganize districts in to 27 districts from Vijaya Dashami but due to protests for districts of Siricilla, Gadwal and Jangaon Telangana CM KCR reviewed the possibilities for including them into the new districts list of Telangana. After discussion with Ministers and Government Officials it is finally declared that Telangana 31 Districts will be reorganized from the day of Vijayadashami. New districts of Telangana increased from the count of 27 to 31 new districts of Telangana.

4 Districts which are added to the previous list of Districts in Telangana are Siricilla, Jangaon, Gadwal and Asifabad.


Telangana 31 Districts list:



  1. Adilabad
  2. Asifabad
  3. Bhoopal Pally
  4. Gadwal
  5. Hanmakonda
  6. Hyderabad (Old)
  7. Jagityal
  8. Jangaon
  9. Kamareddy
  10. Karimnagar
  11. Khammam
  12. Kothagudam
  13. Mahaboobnagar
  14. Mahabubabad
  15. Malkajgiri (Ranga Reddy)
  16. Manchiryala
  17. Medak
  18. Nagarkarnool
  19. Nalgonda
  20. Nirmal
  21. Nizamabad
  22. Peddapally
  23. Sangareddy
  24. Shamshabad (Ranga Reddy)
  25. Siddipet
  26. Sircilla
  27. Suryapet
  28. Vanaparthy
  29. Vikarabad (Ranga Reddy)
  30. Warangal
  31. Yadagiri


Official declaration over 31 districts is yet to finalized by the Government of Telangana.Keep following this space for more updates about New districts of Telangana.


Read More

Wednesday, August 24, 2016

Mana Kamareddy

చివరి అంకానికి చేరిన కామారెడ్డి జిల్లా..


కామారెడ్డి ప్రాంత ప్రజలు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముసాయిదా గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముసాయిదా గెజిట్ నోటిఫికేషన్‌ ప్రకారం 19 మండలాలతో కామారెడ్డి జిల్లా ఏర్పడనుంది. కొత్తగా బాన్సువాడ  రెవిన్యూ డివిజన్‌తోపాటు, రెండు కొత్త మండలాలు ఏర్పడనున్నాయి. మొదటి గెజిట్ నోటిఫికేషన్‌ విడుదల తర్వాత అభిప్రాయాలను, అభ్యంతరాలను వెల్లడించటానికి ప్రభుత్వం నెలరోజుల గడువు విధించింది. వెచ్చే దసరా పండగ తర్వాత అధికారికంగా కామారెడ్డి జిల్లాలో అధికారికంగా కార్యకలాపాలు జరుగనున్నాయి.

కొత్తగా ఏర్పడనున్న రెవెన్యూ డివిజన్‌ బాన్సువాడ స్వరూపం..
బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గంలోని రెండు మండలాలైన బీర్కూర్, బాన్సువాడతోపాటు జుక్కల్ అసెంబ్లీ  నియోజకవర్గంలోని ఐదు మండలాలైన పిట్లం, జుక్కల్, బిచ్కుంద, మద్నూర్, నిజాంసాగర్‌లను కలిపి ఏడు మండలాలతో రెవెన్యూ డివిజన్‌గా బాన్సువాడ ఏర్పడనుండి. బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గపరిధిలో  ఉన్న వర్ని, కోటగిరి మండలాలతోపాటు కొత్తగా ఏర్పాటవుతున్న రుద్రూర్ మండలాన్ని కూడా బోధన్ రెవెన్యూ డివిజన్‌లో కలిపారు.



కామారెడ్డి రెవెన్యూ డివిజన్ స్వరూపం..
కామారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో మార్పు జరుగలేదు. గతంలో మాదిరిగానే కామారెడ్డి, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజవర్గాలతో కలిపి కామారెడ్డి రెవెన్యూ డివిజన్ అలాగే ఉంది. రెవెన్యూ డివిజన్‌లో గతంలో కామారెడ్డి, మాచారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, ఎల్లారెడ్డి, గాంధారి, సదాశివనగర్, తాడ్వాయి, లింగంపేట్, నాగిరెడ్డిపేట్ మండలాలు యథాతదంగా ఉన్నాయి. కొత్తగా రామారెడ్డి, రాజంపేట్ మండలాలు కూడా ఏర్పడ్డాయి. మొత్తం 12 మండలాలతో కామారెడ్డి రెవెన్యూ డివిజన్ కొలువుదీరనుంది.

కామారెడ్డి జిల్లాలోకొత్తగా  ఏర్పడనున్న రెండు మండలాలు..
రాజంపేట్ మండలంలోకి భిక్కనూరు మండలంలోని ఐదు గ్రామాలతోపాటు తాడ్వాయి మండలంలోని ఆరుగొండ, కొండాపూర్, గుండారం, సిద్దాపూర్, దేవాయిపల్లి(ఐదు) గ్రామాలను చేర్చారు. మొత్తంమీద 16 గ్రామాలు ప్రస్తుతం ఉన్న మండలాల నుంచి వేరే మండలాల పరిధిలోకి మారాయి.




Read More

Saturday, June 11, 2016

Mana Kamareddy

మిషన్ కామారెడ్డి జిల్లా..


కామారెడ్డి ప్రాంత చిరకాల కోరికైన కామారెడ్డి జిల్లాగా ఏర్పడటం దాదాపుగా ఖరారయ్యింది. ఇప్పుడు మన ముందు వున్న లక్ష్యం కామారెడ్డి పట్టణాన్ని, జిల్లాని విస్తృతంగా అభివృద్ధి చేసుకోవటం..రోడ్డు, రైలు రవాణా పరంగా ఏంతో అనువుగా వున్న కామారెడ్డి పట్టణాన్ని నిర్దిష్టమైన ప్రణాళికతో సరైన ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేయావల్సిన అవసరం వుంది.


జిల్లా కేంద్రం కాబోతున్న కామారెడ్డి పట్టణంతో పాటు జిల్లాలో అభివృద్ధి ఎలా జరగాలంటే...

  • కామారెడ్డి పట్టణ వ్యాసార్థం కూడా పెరగాల్సిన అవసరం దృశ్య నూతన జిల్లాకి సంబంధించిన ప్రభుత్వ ఆఫీసులను ఇతర ప్రాంతాలనుండి వచ్చే ప్రజలకు అనువుగా ఉండేటట్టు ఏర్పాటు చేయాలి.
  • పట్టణంలో ట్రాఫిక్ రోజురోజుకు పెరుగుతున్న దృశ్య కావలసిన చోట రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపట్టవలసిన అవసరం వుంది.
  • పట్టణంలో కావలసిన చోట ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి.
  • కామారెడ్డి పట్టణంలో విస్తృతంగా చెట్లను నాటి గార్డెన్ టౌన్ గా మార్చి ఇతర జిల్లా కేంద్రాలకు స్ఫూర్తిగా నిలవాలి.
  • కామారెడ్డి బస్సు డిపోను జాతీయ రహదారికి దగ్గర్లో ఏర్పాటు చేసి దగ్గరలో నూతన ప్రయాణ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలి.
  • రోజు రోజుకు పెరుగుతున్న జనాభా కారణంగా, శాంతి భద్రతల దృశ్య పోలీస్ ఔట్ పోస్ట్ ల సంఖ్యను పెంచి, పట్టణంలో వివిధ చోట్ల సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి.
  • కామారెడ్డి పట్టణంలో ఇప్పటికే వున్న రాజీవ్ పార్క్ కి తోడుగా ఇంకో రెండు పార్క్ లను ఏర్పాటు చేయాలి.
  • నూతనంగా ఏర్పడబోయే కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు గుర్తించని పర్యాటక స్థలాలను గుర్తించి వాటిని తెలంగాణా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయాలి.
  • నూతన కామారెడ్డి జిల్లాలోని వివిధ నియోజికవర్గ ప్రధాన పట్టణాలైన బాన్స్ వాడ, ఎల్లారెడ్డి లకు వెళ్ళే రహదారులను మరింత అభివృద్ధి చేస్తే జిల్లా ప్రజలకు అనువుగా మారనుంది.
  • కామారెడ్డి పట్టణానికి సమీపంలో భిక్కనూరు వద్ద వున్న తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో వృత్తి విద్యా కోర్స్ లను ప్రవేశ పెట్టేలా చర్యలు తీసుకోని క్యాంపస్ లో సౌకర్యాలు మెరుగుపరచాలి.
  • ఇప్పటికే విద్యా పరంగా ఎన్నో ప్రైవేట్ కళాశాలలకు నిలయంగా వున్న కామారెడ్డి పట్టణంలో ప్రఖ్యాత ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, డైరీ కాలేజీలలో సౌకర్యాలు మెరుగుపరిచి మరింత అభివృద్ధి చేయాలి.
  • కామారెడ్డి పట్టణంలో సమీపంలో ఉన్న పెద్ద చెరువును మరియు దగ్గరలో వున్న భిక్కనూరు మండలం జంగంపల్లి చెరువును మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేస్తే జాతీయ రహదారికి దగ్గరగా, పర్యాటక పరంగా బాగుంటుంది.
  • తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ దగ్గరలో డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలి. దీని వల్ల దోమకొండ, భిక్కనూరు మండలాలకు చెందిన విద్యార్థులకు అనువుగా ఉంటుంది.
  • కామారెడ్డి పట్టణంలో వున్న ఇందిరా స్టేడియంలో కావలసిన సౌకర్యాలను ఏర్పరచి వివిధ క్రీడలకు నెలవుగా మార్చవలసిన అవసరం వుంది. కామారెడ్డి డిగ్రీ కాలేజీ దగ్గరలో ఇండోర్ స్టేడియం ఏర్పాటుచేసే దిశగా చర్యలు తీసుకోవాలి.
  • కామారెడ్డి పట్టణంలో ప్రధానంగా వున్న త్రాగు నీటి సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం వుంది.
  • కామారెడ్డి పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తే రాకెట్ వేగంతో అభివృద్ధి అయ్యే అవకాశాలు వున్నాయి.
  • రెవిన్యూ డివిజన్ కాబోతున్న బాన్స్ వాడ పట్టణంలో వున్న ఎస్ అర్ ఎన్ కె కాలేజీ ని విస్తరించి కొత్త కోర్స్ లు ప్రవేశ పెట్టెల చర్యలు తీసుకోవాలి.
  • నూతన జిల్లాలో ఒక పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయాలి
కొత్తగా ఏర్పడబోతున్న జిల్లా కేంద్రాల్లో మన కామారెడ్డి పట్టణానికి అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్న దృశ్య నూతన జిల్లాకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఇదే మంచి అవకాశంగా భావించి చిత్తశుద్ధితో పనిచేయవలసిన అవసరం వుంది.


Read More

Thursday, June 09, 2016

Mana Kamareddy

తెలంగాణ రాష్ట్రంలో రానున్న కాలంలో జిల్లాల స్వరూపం...


నిన్నటి ప్రతిపాదనల ప్రకారం తెలంగాణలో మొత్తం 10 జిల్లాలు 23 జిల్లాలుగా మారనున్నాయి. అలాగే  ప్రస్తుతమున్న 44 రెవెన్యూ డివిజన్ లకు తోడు కొత్తగా 9 రెవెన్యూ డివిజన్ లు ఏర్పడనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 459 మండలాలతో పాటు కొత్తగా 74 మండలాలు ఏర్పడబోతున్నాయి. మన కామారెడ్డి జిల్లాలో 10,68,773 మంది జనాభా మరియు జిల్లా వైశాల్యం 4025 చ.కి.మీ తోపాటు 21 మండలాలు వుండనున్నాయి.

తెలంగాణ  రాష్ట్రంలో జిల్లాల స్వరూపం :

కామారెడ్డి జిల్లా: 10,68,773 మంది జనాభా, వైశాల్యం 4025 చ.కి.మీ, 21 మండలాలు
• నిజామాబాద్ జిల్లా:  14,47,961 మంది జనాభా, వైశాల్యం 3772 చ.కి.మీ, 25 మండలాలు
• రంగారెడ్డి జిల్లా:  10,86,522 మంది జనాభా, వైశాల్యం 4157 చ.కి.మీ, 20 మండలాలు
• సంగారెడ్డి జిల్లా:  11,86,280 మంది జనాభా, వైశాల్యం 3116 చ.కి.మీ, 18 మండలాలు
ఆచార్య జయశంకర్ జిల్లా:  8,59,453 మంది జనాభా- వైశాల్యం 6,760 చ.కి.మీ, 21 మండలాలు, 3 రెవెన్యూ డివిజన్లు
• వరంగల్ జిల్లా: 22,36,051 మంది జనాభా, వైశాల్యం 4883 చ.కి.మీ, 31 మండలాలు
ఆదిలాబాద్ జిల్లా: 14,22,034 జనాభా- వైశాల్యం 7,673 చ.కి.మీ 27 మండలాలు, 4 రెవెన్యూ డివిజన్ లు
భద్రాది జిల్లా: 11,93,807 జనాభా, వైశాల్యం 8297చ.కి.మీ, 23 మండలాలు
• జగిత్యాల జిల్లా: 10,43,000 మంది జనాభా, వైశాల్యం 3,087 చ.కి.మీ, 18 మండలాలు
• కరీంనగర్ జిల్లా: 18,02,038 మంది జనాభా, వైశాల్యం 4,308 చ.కి.మీ, 26 మండలాలు

యాదాద్రి జిల్లా: 7,19,131 మంది జనాభా, వైశాల్యం 2,956 చ.కి.మీ,17 మండలాలు
హైదరాబాద్ జిల్లా: 39,01,928 జనాభా, వైశాల్యం 1914 చ.కి.మీ, 20 మండలాలు
ఖమ్మం జిల్లా: 13,80,137 మంది జనాభా, వైశాల్యం 4,360 చ.కి.మీ, 22 మండలాలు
కొమురం భీం జిల్లా 13,19,205 మంది జనాభా, వైశాల్యం 8,422 చ.కి.మీ, 27 మండలాలు


మహబూబాబాద్ జిల్లా 8,04,136 మంది జనాభా, వైశాల్యం 3633 చ.కి.మీ, 15 మండలాలు
మహబూబ్ నగర్ జిల్లా: 18,67,620 మంది జనాభా, వైశాల్యం 6518 చ.కి.మీ, 31 మండలాలు
• మెదక్ జిల్లా: 14,44,955 మంది జనాభా,వైశాల్యం 4215 చ.కి.మీ , 25 మండలాలు
• నల్గొండ జిల్లా: 15,55,992 మంది జనాభా, వైశాల్యం 7475 చ.కి.మీ, 32 మండలాలు
• సికింద్రాబాద్ జిల్లా: 42,51,614 మంది జనాభా, వైశాల్యం 1608 చ.కి.మీ, 23 మండలాలు
నాగర్ కర్నూలు జిల్లా: -10,48,425 మంది జనాభా, వైశాల్యం 7447 చ.కి.మీ, 22 మండలాలు
వనపర్తి జిల్లా: 11,36,983 మంది జనాభా, వైశాల్యం 4426 చ.కి.మీ, 22 మండలాలు
సిద్ధిపేట జిల్లా: 11,90,209 మంది జనాభా, వైశాల్యం 4398 చ.కి.మీ, 22 మండలాలు
సూర్యాపేట జిల్లా: 13,86,883 మంది జనాభా వైశాల్యం 4348 చ.కి.మీ , 25 మండలాలు




Read More

Sunday, May 29, 2016

Mana Kamareddy

కొత్త జిల్లాల తుది జాబితాలో మన కామారెడ్డి..

విశ్వసనీయ సమాచారం ప్రకారం మన రాష్ట్రంలో కొత్త జిల్లాల కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది.తీవ్ర మల్లగుల్లాలు, వరుస సమీక్షల అనంతరం అధికార యంత్రాంగం 14 కొత్త జిల్లాలతో తుది జాబితాను ఖరారు చేసింది. దీంతో ఇప్పుడున్న పది జిల్లాలతో కలిపి మొత్తంగా 24 జిల్లాలతో తెలంగాణకు కొత్త రూపం రాబోతోంది. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మ్యాపులు, సరిహద్దుల వివరాలన్నీ భూపరిపాలనా ప్రధాన కమిషనరేట్ (సీసీఎల్‌ఏ) సిద్ధం చేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం కేంద్రంగా కొత్తగా భద్రాద్రి జిల్లాను... నల్లగొండ జిల్లాలోని భువనగిరి కేంద్రంగా యాదాద్రి జిల్లాను ఏర్పాటు చేయనున్నారు.

సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లో సిద్ధిపేటతోపాటు సంగారెడ్డిని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారు. నిజామాబాద్‌లో కామారెడ్డి ని, కరీంనగర్‌లో జగిత్యాలను కొత్త జిల్లా కేంద్రాలుగా ఎంపిక చేశారు. మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల కేంద్రం జిల్లా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై అధికారులు సానుకూలంగా స్పందించలేదు. ఇక్కడ ముందుగా అనుకున్న మేరకే వనపర్తి, నాగర్‌కర్నూల్‌లను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నారు.
రెండు రెండు జిల్లాలే..

ఇక ఇంతకుముందే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన మాట ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాలను కొమురం భీం జిల్లాగా, వరంగల్‌లోని భూపాలపల్లిని ఆచార్య జయశంకర్ జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ప్రజల నుంచి వెల్లువెత్తిన డిమాండ్లను పరిశీలించిన అధికార యంత్రాంగం... వరంగల్ జిల్లాలోని జనగామకు బదులుగా మహబూబాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపింది. దీంతో అనూహ్యంగా మహబూబాబాద్‌కు కొత్త జిల్లాల జాబితాలో చోటు దక్కింది. ఇక నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట కేంద్రంగా కొత్త జిల్లా రానుంది.


రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల విభజనపై సుదీర్ఘంగా కసరత్తు చేసిన అధికారులు... హైదరాబాద్‌ను రెండు జిల్లాలుగా, రంగారెడ్డిని రెండు జిల్లాలుగా మాత్రమే విభజించాలనే నిర్ణయానికి వచ్చారు. రంగారెడ్డిలో వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లాను, హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. వాస్తవానికి హైదరాబాద్‌ను నాలుగు జిల్లాలుగా చేయాలని తొలి నుంచీ ప్రతిపాదనలు ఉన్నాయి.

కానీ రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసేందుకే సీఎం కేసీఆర్ మొగ్గుచూపారు. అయినా కూడా ఇతర ప్రత్యామ్నాయాలేమైనా ఉంటే సూచించాలని రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. మొత్తంగా కొత్త జిల్లాలకు సంబంధించి తుది జాబితా దాదాపు ఖరారయింది. దీనిపై సోమవారం జరుగనున్న జిల్లాల కలెక్లర్ల సమావేశంలో మరోసారి చర్చించనున్నారు. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇబ్బందులు, అభ్యంతరాలేమైనా ఉంటే తెలియజేయాలని ఉన్నతాధికారులు ఇప్పటికే కలెక్టర్లకు సమాచారం ఇచ్చారు.



Read More

Saturday, May 21, 2016

Mana Kamareddy

చివరి అంకానికి చేరుకున్న కొత్త జిల్లాల ప్రక్రియ..!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ రెండున కొత్త జిల్లాలను ప్రకటించాలన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చురుకుగా సాగుతున్నది. ఇప్పటిదాకా దాదాపు 21 కొత్త జిల్లాలపై స్పష్టతకు వచ్చినట్టు సమాచారం. మూడు, నాలుగింటిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదాద్రిని ఏ జిల్లా పరిధిలోకి తేవాలన్న విషయంలో తర్జనభర్జనలు కొనసాగుతున్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. జిల్లా స్వరూపం ఎలా ఉండాలన్నదానిపైనా స్పష్టమైన విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్టు సమాచారం. ఒక్కో జిల్లా 60-70 కిలోమీటర్ల వైశాల్యం మించకుండా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని తెలిసింది. 

కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో వీలు దొరికినప్పుడల్లా కొత్త జిల్లాల కూర్పుపైనే సీఎం ప్రత్యేకంగా చర్చిస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. ఇదే క్రమంలో గురువారం రాత్రి కూడా సీనియర్ అధికారులతో దాదాపు మూడు గంటలకుపైగా సీఎం చర్చించినట్లు సమాచారం. అధికారులు క్రోడీకరించిన అంశాలు, సీఎం కేసీఆర్ ఇప్పటికే సేకరించి తన వద్ద పెట్టుకున్న సమాచారం ఆధారంగా దాదాపు 21 జిల్లాలపై స్పష్టతకు వచ్చినట్టు తెలిసింది. 
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండలను రెండేసి జిల్లాలుగా, మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్‌లను మూడేసి జిల్లాలుగా ఏర్పాటుచేయడంతోపాటు వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలిసింది.



Read More

Friday, May 13, 2016

Mana Kamareddy

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం..

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వరుసగా సమీక్షలు నిర్వహించడంతో... రెవెన్యూ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే సీఎస్ రాజీవ్శర్మ అధ్యక్షతన నలుగురు ఉన్నతాధికారులతో కమిటీని ప్రభుత్వం నియమించింది. మరోవైపు శాటిలైట్ మ్యాపులు, గూగుల్ మ్యాపులను ఆధారంగా చేసుకుని కొత్త జిల్లాల హద్దులను గుర్తించే ప్రక్రియ మొదలైంది.

జిల్లాల ఏర్పాటుపై ముందు నుంచి కసరత్తు చేస్తున్న భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్) 3 నమూనాల్ని సిద్ధంచేసి ప్రభుత్వానికి సమర్పించారు. వాటిలో ప్రభుత్వం ఎంపిక చేసిన నమూనా ప్రకారం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. అనంతరం అభ్యంతరాలను స్వీకరించి.. కొత్త జిల్లాల తుది స్వరూపాన్ని ఖరారు చేస్తారు. ప్రస్తుతం ఇచ్చిన మూడు నమూనాలకు సీసీఎల్ వేర్వేరు ప్రాతిపదికలను అనుసరించింది. పార్లమెంట్ నియోజకవర్గానికో జిల్లా ఉండేలా ఒక నమూనా, జనాభా ప్రాతిపదికన మరో నమూనా, అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రాతిపదికగా మరో నమూనాను రూపొందించినట్లు సమాచారం.

అదనంగా 14 జిల్లాల వరకు పెంచేందుకు వీలుగా నమూనాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (ట్రాక్) సహాయంతో సీసీఎల్ మ్యాప్లను తయారు చేయించారు. ఇదే తీరుగా సరిహద్దు నమూనాలతో మరిన్ని మ్యాప్లు తయారు చేయాలని సంబంధిత నిపుణులకు ప్రభుత్వం సూచించింది. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల పరిధిలో జిల్లా కేంద్రం నుంచి అన్ని ప్రాంతాలకు దూరం 60 కిలోమీటర్లకు మించకుండా ఉండేలా చూడాలన్న సీఎం సూచనకు అనుగుణంగా శాస్త్రీయంగా కసరత్తు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

అభిప్రాయ సేకరణకు కమిటీలు

క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేయడానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ తాజాగా బాధ్యతలు అప్ప గించారు. ఒక్కో జిల్లాకు ఇద్దరు నేతలతో కూడిన 9 కమిటీలను నియమించారు. గ్రామ, మండల, జిల్లాల స్థాయిలో పునర్విభజన స్వరూపం ఎలా ఉండా లి, ప్రాంతాల వారీగా ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ల ఆకాంక్షలకు అనుగుణంగా ఏయే ప్రాంతాల్ని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలి, అందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై అధ్యయనం చేసి నివేదికలు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది.
9 కమిటీల సమన్వయ బాధ్యతలను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డికి అప్పగించినట్లు సమాచారం. హైదరాబాద్లో పరిస్థితులను అధ్యయనం చేసే బాధ్యతా ఆయనకే అప్పగించారు. మెదక్ జిల్లాలో హరీశ్ సూచనల మేరకు కమిటీ పని చేయాలని సీఎం చెప్పినట్లు సమాచారం.

పునర్విభజన కమిటీల సభ్యులు

నిజామాబాద్: ప్రశాంత్రెడ్డిగంప గోవర్ధన్
ఖమ్మం: తుమ్మల నాగేశ్వరరావు, పాయం వెంకటేశ్వర్లు
రంగారెడ్డి: మహేందర్రెడ్డి, కృష్ణమూర్తి
నల్లగొండ: జగదీశ్రెడ్డి, గ్యాదరి కిషోర్
మహబూబ్నగర్: నిరంజన్రెడ్డి, గువ్వల బాలరాజు
కరీంనగర్: వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వర్
ఆదిలాబాద్: లోకా భూమారెడ్డి, వేణుగోపాలాచారి
మెదక్: శేరి సుభాష్రెడ్డి, మానిక్రెడ్డి
వరంగల్: పెద్ది సుదర్శన్రెడ్డి, మధుసూదనాచారి






Read More

Friday, September 04, 2015

Mana Kamareddy

ఆశల పల్లకిలో కామారెడ్డి జిల్లా!!


తెలంగాణా రాష్ట్రంలో నూతనంగా పది జిల్లాలను ఏర్పాటు చేయటానికి రాష్ట్ర కాబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణా జిల్లాల విభజన చట్టాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్దమౌతోంది. దీనిలో భాగంగా సిఎస్ ఆధ్వర్యంలో ఒక కమిటిని కుడా ఏర్పాటు చేసింది. మొదటి విడుతలో పది జిల్లాలను ఏర్పాటు చేయటానికి రంగం సిద్దమైంది. మీడియాకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం, మొదటి జాబితాలో కామారెడ్డి జిల్లా పేరు వుంటుందో లేదో అనే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. సహజంగానే అందరు అనుకున్నట్లు ముఖ్యమంత్రి సొంత జిల్లాయిన మెదక్ జిల్లాను మూడు జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.

గత రెండు రోజులుగా మీడియాలో,  కామారెడ్డి జిల్లా పై వస్తున్న రకరకాల ఊహాగానాలతో కామారెడ్డి ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావటానికి సమయం కూడా తక్కువగా ఉన్నందున పార్టీలకు అతీతంగా నాయకులందరూ ఏకతాటిపై వచ్చి ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం ముందు గట్టిగా వినిపించవలసిన తక్షిణ అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.



Read More

Friday, March 13, 2015

Mana Kamareddy

తెలంగాణా రాష్ట్రంలో నూతన జిల్లాగా మన కామారెడ్డి: ముఖ్యమంత్రి ప్రకటన

మన కామారెడ్డి:  కామారెడ్డి ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కామారెడ్డి జిల్లా ప్రకటన చివరగా మన ముఖ్యమంత్రి నోటి ద్వార వచ్చేసింది. మిషన్ కాకతీయ పనులను ప్రారంభించటానికి  సదాశివనగర్ కి విచ్చేసిన మన ముఖ్యమంత్రి, బహిరంగ సభలో మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడబోయే జిల్లాల జాబితాలో కామారెడ్డి వంద శాతం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో భారినీటిపారుదల శాఖా మంత్రి హరీష్ రావు తో పాటు ఇతర మంత్రులు, ఏంయల్ఎ లు మరియు తెరాస నాయకులు పాల్గొన్నారు.

నిజానికి కామారెడ్డి జిల్లా ప్రకటన రానున్న కాలంలో కామారెడ్డి లో జరిగే బహిరంగ సభలో ప్రకటించే ఆవకాశం వున్న సభలో పాల్గొన్న ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి  ఈ సభ లోనే చేయాల్సివచ్చింది. కామారెడ్డి ప్రకటన వెలువడిన అనంతరం కామారెడ్డి ప్రాంత ప్రజలు హర్షాతిరేకంతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ప్రకటనకై మన కామారెడ్డి పోర్టల్ తో పాటు పోరాటం చేసిన కామారెడ్డి జిల్లా గా డిమాండ్ ఫేస్బుక్ పేజి మరియు కామారెడ్డి డిస్ట్రిక్ట్ పేజిలతో పాటు కామారెడ్డి ఐక్య కార్యాచరణ సమితి, విద్యార్ధి ఐక్య కార్యాచరణ సమితితో పాటు ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నాం.
కామారెడ్డి జిల్లా ప్రకటన తర్వాత ఉద్వేగానికి లోనై ముఖ్యమంత్రి కెసిఆర్ కి పాదాభివందనం చేస్తున్న మన MLA, విప్ గంపగోవర్ధన్.
- కెసిఆర్ కామారెడ్డి జిల్లా ప్రకటన చేస్తున్న వీడియో కోసం click చేయండి.


Read More

Wednesday, January 21, 2015

Mana Kamareddy

కామారెడ్డి జిల్లాలో తెలంగాణావిశ్వవిద్యాలయ దక్షిణ ప్రాంగణాన్ని విశ్వవిద్యాలయంగా మారుస్తే?



మన కామారెడ్డి: త్వరలో ఏర్పడనున్న కామారెడ్డి జిల్లాలో ఒక విశ్వవిద్యాలయం ఏర్పడితే కామారెడ్డి చుట్టూ పక్కల ప్రాంతాల వారికి విద్యాపరంగా చాలబాగుంటుంది..ఇప్పటికే చదువుల తల్లికి నిలయమైన మన కామారెడ్డి కి విశ్వవిద్యాలయం ఒక కీరిటంలా  ఉంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.

ఇప్పటికే కామారెడ్డి డివిజన్ లో భిక్కనూరు వద్ద 1976 లో ఉస్మానియా యూనివర్సిటీ కి అనుబంధంగా కెమిస్ట్రీ , ఇన్ఫర్మేషన్ సిస్టం లాంటి కోర్స్ లతో  పి జి సెంటర్ గా ప్రారంభమై అంచెలంచెలుగా ఎదుగుతూ ఉస్మానియా పి జి కాలేజీ గా మారి తెలంగాణా యూనివర్సిటీ  సౌత్ క్యాంపస్ రూపాంతరం చెందిన చరిత్రాత్మకమైన తెలంగాణా విశ్వవిద్యాలయ దక్షిణ ప్రాంగణాన్ని విశ్వవిద్యాలయంగా మారుస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణా విశ్వవిద్యాలయ దక్షిణ ప్రాంగణం, జాతీయ రహదారికి దగ్గరగా వుండటం కూడా అనుకూలించే అంశం.

తెలంగాణా విశ్వవిద్యాలయ దక్షిణ ప్రాంగణంలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన వాటర్ ట్యాంక్ 


Read More

Sunday, January 18, 2015

Mana Kamareddy

Kamareddy District



Read More

Sunday, December 14, 2014

Mana Kamareddy

కామారెడ్డి ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి: నారగోని

మనకామారెడ్డి: కామారెడ్డి ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని బిసి ఐక్య సంఘర్షణ సమితి జాతీయ అద్యక్షుడు నారగోని డిమాండ్ చేసారు. ఈ సందర్బంగా అయన అర్ అండ్ బీ అతిధి గృహంలో మాట్లాడారు. 




Read More

Thursday, November 27, 2014

Mana Kamareddy

మన కామారెడ్డి ని జిల్లాగా...




Read More

Tuesday, November 11, 2014

Mana Kamareddy

కామారెడ్డి ని జిల్లా గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ TGVP అద్వర్యాన జరిగిన సదస్సు (10.11.2014)

కామారెడ్డి ని జిల్లా గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ TGVP జరిగిన సదస్సు (10.11.2014) జయప్రదం అయింది సదస్సు కు సంబంధించిన  Photos మీకోసం





Read More

Saturday, September 20, 2014

Mana Kamareddy

Kamareddy Public Views and Demands to make their region a District

Kamareddy Public Views  and  Demands to make their region a District




Read More

Tuesday, September 16, 2014

Mana Kamareddy

Kamareddy Bandh against Demand for Kamareddy district

 A bandh, which was observed in response to a call given by the JAC comprising all people’s organisations, political parties (except TRS), caste associations and student unions in Kamareddy town on Tuesday, demanding the government make it as a separate district, was total and peaceful.

All schools and educational institutions, banks, shops and business establishments remained closed. The RTC suspended its services, cinema halls were closed and employees’ attendance in government offices was thin. The agitators went round the town enforcing the bandh.

(Source: Hindu)
z


Read More