Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks
Showing posts with label Useful. Show all posts
Showing posts with label Useful. Show all posts

Tuesday, July 12, 2016

Mana Kamareddy

హరితహారంలో భాగంగా జన్మ నక్షత్రం ఆధారంగా నాటవలసిన మొక్కల వివరాలు మీకోసం..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరిత హారం పథకం ఒక ఉద్యమంలా ముందుకు సాగుతోంది. ఈ కార్యాక్రమంలో నాయకలు, చిత్ర పరిశ్రమ కి చెందిన ప్రముఖులతో పాటు ప్రజలు ఎంతో  ఆసక్తిగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంలో జన్మ నక్షత్రం ఆధారంగా నాటవలసిన మొక్కల పేర్లను పోస్ట్ చేస్తున్నాం..


Photo: Eenadu


Read More

Sunday, April 17, 2016

Mana Kamareddy

మొబైల్ యాపే.. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తూ సరికొత్త రీతిలో మొబైల్ వాలెట్ యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఈ ఎం-వాలెట్ యాప్‌ను రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కె.తారకరామారావు ఈ మధ్యే విడుదల చేసారు. విడుదల చేసిన మొదటి పది రోజుల్లోనే సుమారు రెండు లక్షల మంది ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు.

ప్రయాణ సమయంలో పోలీసులు లేదా రవాణా అధికారులు తనిఖీ చేస్తే ఆర్టీఏ ఎం-వాలెట్ యాప్‌ ఓపెన్ చేసి ఒక్క క్లిక్‌తోనే వాహనానికి సంబంధించిన పత్రాలన్నీ చూపించవచ్చు. ఈ యాప్ లో ఒక్కసారి మొబైల్ నెంబర్ తో నమోదు చేసుకుంటే చాలు.. ఏ ఇతర మొబైల్ నుంచి అయినా మన వాహనానికి సంబంధించిన వివరాల్ని చూడొచ్చు. వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినప్పుడు.. ఆ వాహనం ఎవరి పేరిట ఉన్నది..? నడిపే వ్యక్తి అసలు యజమానా? కాదా? అనే విషయం ఎంవాలెట్ యాప్‌లో ఇట్టే తెలిసిపోతుంది. ట్రాఫిక్ ఉల్లంఘించిన వ్యక్తి వాహనయజమాని కాకపోతే అతడి ఫోన్‌నంబర్‌కు సమాచారం అందుతుంది. ఎంవాలెట్ యాప్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్‌ఫామ్‌లలో లభిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి.. ఆర్టీఏ ఎం వ్యాలెట్ మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి..


  • ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ కోసం Download క్లిక్ చేయండి

  • ఐవోఎస్ యాప్ డౌన్లోడ్ కోసం Download క్లిక్ చేయండి

డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అయ్యే విధానం:

1.REGISTER బటన్ మీద క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి Resend OTP క్లిక్ చేయండి. ఆరెంకల నెంబర్ మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కి  వస్తుంది .

2.ఆరెంకల OTP నెంబర్ ఎంటర్ చేసి SUBMIT క్లిక్ చేయాలి.


3.డ్రైవింగ్ లైసెన్స్ కోసం DRIVING LICENSE బటన్ క్లిక్ చేయండి ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, పుట్టిన తేది, మీరు డ్రైవింగ్ లైసెన్స్ పొందిన ఆఫీసుని సెలెక్ట్ చేసుకొని GET బటన్ క్లిక్ చేయండి  


4.ఆర్సీ కోసం RC బటన్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ , 5 అంకెల చేసిస్స్ నెంబర్ ఎంటర్ చేసి GET బటన్ క్లిక్ చేయండి.


వీడియో:



Read More

Thursday, July 23, 2015

Mana Kamareddy

ఆధార్ కార్డు ఉంటే 10 రోజుల్లో పాస్‌పోర్ట్..!!

ఆధార్ కార్డు ఉన్న వారికి ఓ శుభవార్త. ఆధార్ కార్డు ఉన్నవారు 10 రోజుల్లో పాస్‌పోర్ట్ పొందే అవకాశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కల్పిస్తోంది. ఇందుకోసం ఆధార్ కార్డు సమాచారాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోతో అనుసంధానం చేయనున్నారు. ఇలా చేయడం వల్ల దరఖాస్తుదారుని(ఆమె/అతడు) గత నేర చరిత్ర ధ్రువీకరణ కోసం గుర్తింపుగా ఆధార్ కార్డును వినియోగించనున్నట్లు శాఖ అధికారి తెలిపారు. కొత్త, తత్కాల్ పాస్‌పోర్టులకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుని పౌరసత్వం, నేర పూర్వాపరాలు, నేరారోపణలను లాంటి వాటిని పోలీసు తర్వాత ధృవీకరించనున్నారు. ప్రస్తుతం పాస్ పోర్టుల జారీ విషయంలో పోలీసు ధృవీకరణ ఆలస్యం అవతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ తాజా ఫార్మెట్‌లో దరఖాస్తుదారు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. గుర్తింపు మరియు చిరునామా కింద ఆధార్ కార్డు తప్పనిసరి. దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లో దరఖాస్తుదారు అపాయింట్మెంట్ పొందుతారు. మరొక ఏడు రోజుల్లో, పాస్ పోర్ట్‌ని ప్రాసెస్ చేసి ఇంటికి పంపడం జరుగుతుంది. ఆ తర్వాత పోలీసు ధృవీకరణ కోసం ఇంటికి వస్తారు. పాస్ పోర్టు జారీల విషయంలో జరుగుతున్న ఆలస్యాన్ని అధిగమించడానికి ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం, ఇంటిలిజెన్స్ బ్యూరో విభాగంతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధార్ కార్డుని తప్పనిసరి చేసింది. దీనిని అమలు చేసేందుకు యుఐడిఎఐతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్వయం చేసుకుంటుంది


Read More