నా జీవితంలో చాల ఒడిదుడుకులు ఎదుర్కొన్న 1987-88 ప్రాంతంలో మా నాన్నగారు కడపలో పనిచేసేవారు. కామారెడ్డికి దగ్గరగా తాడ్వాయ్ గ్రామంలో నేను ఒక సాయంత్రం వేళలో శ్రీ శబరిమాత ఆశ్రమానికి వెళ్ళాను.
చిన్నప్పటి నుండి ఉన్న తెగింపుతోనే, చేతిలో పెద్దగా డబ్బులు లేకపోయినా, తాడ్వాయ్ గ్రామంలో ఎవరు తెలియకపోయినా అక్కడికి వెళ్ళాను.
శ్రీ శబరిమాత అప్పుడు ధ్యానంలో ఉన్నారు కాబట్టి వెంటనే దర్శనం లభించలేదు. మరుసటిరోజున ఏదో కారణంగా బంద్ జరుగబోతోందని మాత్రం తెలుసును. నాకు ఏమి చేయాలో తెలియలేదు. అలాగే ఉండిపోయాను. ఏమైనా తినడానికి దొరుకుతుందేమోనని అడిగితే, కుదరదని ఆ ఆశ్రమ నిర్వాహకురాలు చెప్పినట్లు గుర్తు.
రాత్రి షుమారుగా 7-8 ప్రాంతంలో శ్రీ శబరిమాత బయటకు వచ్చారు. అందరిని పలుకరిస్తూంటే నేను కూడా ముందుకు వెళ్ళాను. నన్ను చూసి "ఎక్కడి నుంచి వచ్చావు బిడ్డా!" అని అడుగుతే నేను చెఫ్ఫాను.
అన్నం తిని రాత్రికి అక్కడే పడుకున్నాను. మరుసటి రోజు ఉదయం 10-11 గంటల వరకు నాకు ఆమె దర్శనం దొరుకలేదు. నాతో మాట్లాడిన తరువాత నన్ను అన్నం తిని వెళ్ళమని చెప్పారు.
అన్నం తిని బయటకు వచ్చి కొంచెం దూరం నడిచిన తరువాత హైదరాబాదు వైపు వెళ్ళే లారీ దొరికింది.
- భక్తుడు వ్రాసిన కామెంట్ ని ఇక్కడ క్లిక్ చేసి క్రింది బాగంలో చూడగలరు..