కామారెడ్డి పట్టణం లో గల శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం యొక్క చరిత్ర మన పోర్టల్ అభిమానులకోసం అందిస్తున్నాం
|
గర్భాగుడి లో మూలవిరాట్ |
కొన్ని వందల సంవత్సరాల క్రితం కామారెడ్డి లో శ్ర్రీ కృష్ణుని ఆలయా నిర్మాణానికి సంకల్పించిన పుర ప్రజలు కోడూరు (కిష్థమ్మ గుడి-పెద్దమ్మ గల్లీ) సమీపంలో ఒక అత్యద్భుతమైన ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు,నిర్మాణం పూర్తై విగ్రహ ప్రతిష్టాపన చేయకముందే ఆలయం లో దోపిడి మరియు ఆలయంలో కొన్ని అసభ్యకార్యకలపాలు జరగసగాయి.
అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత శ్రీ కృష్ణ పరమాత్ముడు కామారెడ్డి గ్రామ పెద్ద స్వప్నంలో కనిపించి నీచులు మలిన పరిచిన ఆ ఆలయం నాకు వద్దని,మీరందరు భవ్యమైన గ్రామము లో ఉండి నన్ను వూరి బయట ప్రతిష్టిస్తారా అని ప్రశ్నించి తనకు ఊరి మధ్యలో బ్రహ్మాండమైన ఆలయం నిర్మించాల్సిందిగా గ్రామపెద్దను ఆదేశించెను. వెంటనే గ్రామపెద్ద గ్రామజనులందరితో తన స్వప్నమును గూర్చి చెప్పగా కామారెడ్డి గ్రామం లో గల ధర్మపరాయణులు ,ఆస్తికులు, సత్ప్రవర్తన కలిగిన వారైన కామారెడ్డి ప్రజలు శ్రీ కృష్ణ పరమాత్మ కొరకై అత్యద్భుతమైన ఆలయం నిర్మించినారు ,ఆ ఆలయమే మన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. ఈ ఆలయం కామారెడ్డి పట్టణం లోని పెద్ద బజార్ లో కలదు.
|
ఆలయ ప్రధాన ద్వారం |
సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నారాయణుడే స్వయంగా నిర్మించుకున్న ఈ ఆలయాన్ని దర్శించి స్వామి వారి అనుగ్రహం పొందగలరు.
|
ధ్వజస్తంభం మరియు గర్ఘగుడి |