తెలంగాణ పల్లెప్రగతి ద్వారా 150 మండలాల్లో ఈ- పంచాయతీల ఏర్పాటు, దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్టు, మారుమూల గ్రామాలకి సైతం ఈ- గవర్నెన్స్ ఫలాలను తీసుకెళ్లెందుకు ఉద్దేశించిన ఈ- పంచాయతీల ఏర్పాటు కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా నుంచి శ్రీకారం చుట్టనున్నట్టు పంచాయితీరాజ్ మరియు ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ఈ- పంచాయితీల ఏర్పాటుకి తాము ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపిన మంత్రి...నిజామాబాద్ జిల్లాలోని దోమకోండ మండలంలో మెదట ఈ కార్యక్రమాన్ని మెదట ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు.
గ్రామాల్లోని ప్రజలకి రైతులకి ఈ- పంచాయితీల ద్వారా అనేక ప్రజయోజనాలు కలుగుతాయని, ముఖ్యంగా రైతులకి పంటల ఉత్పత్తుల ధరలు, విద్యార్దులకి , నిరుద్యోగ యువతకి ఈ కేంద్రాల ద్వారా ప్రతి సారి దగ్గరలోని పట్టనానికి వెళ్లాల్సిన ప్రయాస తప్పుతుందన్నారు. ఈ- పంచాయితీల ఏర్పాటు కోసం ఇప్పటకే పలువురు సర్వీసు ప్రోవైడర్లు, సేవా ఏజెంట్లు, ఈ పంచాయితీ సాప్ట్ వేర్ రూపకల్పన కోసం పలువురితో చర్చలు జరిపామన్నారు. ఈ- పంచాయితీల కనెక్టివీటీ కోసం పలు విధానాలను పాటించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విశాట్ టెక్నాలజీ, ఫైబర్ అఫ్టీక్ కెబుల్ కనెక్టవీటిని ఉపయోగించుకోబోతున్నట్లు మంత్రి తెలిపారు.
మెట్టమెదట నిజామాబాద్ దోమకోండలో ఏర్పాటు చేయబోయే సేవలను మెత్తం మండలంలోని అన్ని గ్రామా పంచాయితీల్లో ప్రారంభం చేస్తామని, ఈ మేరకి పంచాయితీరాజ్ శాఖ కమీషనర్ అనితా రాంచంద్రన్ కి తగిన ఏర్పాటు, మౌళిక వసతులు ఏర్పాటు చేయాలని అదేశించారు. ఆ మండలంలోని 18 గ్రామపంచాయితీల పరిధిలో చదువుకున్న మహిళ/యువతిని ఏంపిక చేసి వారికి ఈ పంచాయితీల నిర్వహణకి శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ మండలంతో పాటు మరో రెండు మూడునెలల్లో మెత్తం జిల్లాలో ఉన్న మెత్తం 36 మండలాల్లోనూ ఈ సేవలను విస్తరిస్తామన్నారు. మెత్తం తెలంగాణలో నిజామాబాద్ జిల్లా పూర్తిగా ఈ- పంచాయితీలు కలిగిన జిల్లాగా మారబోతుందన్నారు. నిజామాబాద్ జిల్లాలో కేంద్రం ప్రభుత్వం చేపట్టిన జాతీయ అప్టిక్ ఫైబర్ నెట్ వర్క్ పథకంలో భాగంగా చేపట్టిన కనెక్టీవిటీ పనలు త్వరలోనే పూర్తి కాబోతున్నాయని, అమేరకి జిల్లాలోని అన్ని పంచాయితీలకి ఇంటర్ నెట్ సౌకర్యాన్ని పొందుతాయని, దశల వారీగా ఈ సౌకర్యం కలిగిన తీరుగా అయా మండలాల్లో ఈ పంచాయితీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇంటర్ నెట్ కనెక్టవీటి లేని చోట విశాట్ పరిజ్ఘానాన్ని వాడుకుంటున్నట్లు తెలిపారు.
మెత్తం తెలంగాణలో జరుగుతున్న జాతీయ అప్టిక్ ఫైబర్ నెట్ వర్క్ పథకం పనులను సమీక్షించిన మంత్రి కె.తారక రామారావు వాటిని మరింత వేగంగా పూర్తి చేయాలని కోరారు. వచ్చే జూన్ రెండు నాటికి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఈ పనులు పూర్తి చేయాలని, అయా జిల్లాల్లో ఈ- పంచాయితీలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. తెలంగాణ ప ఈ -పంచాయితీలను ఏర్పాటు చేయబోతున్నమని, మండలాల్లోనూ సాద్యమైనంత త్వరగా ఏర్పాటు చేస్తమన్నారు.
Article Credit: Praveen