దక్షిణ కాశిగా పేరుగాంచిన భిక్కనూరు సిద్దరామేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల తేది 7 నుండి 11 వరకు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా స్వామి వారి కళ్యాణం వేదపండితుల మంత్రోచ్చారణల మద్య మాతా భువనేశ్వరి తో ఘనంగా జరిగింది. రుద్రకారుని వేషంలో ఆలయ మహంత్ శ్రీ సిద్దగిరి, రామగిరి ల సమాధుల వద్ద ప్రత్యేక పూజలు చేసారు, కల్యాణం అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించిన రథంలో ఊరేగించారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా జిల్లానుండే కాకుండా ప్రక్క జిల్లాలనుండి మరియు ఇతర రాష్ట్రాలనుండి భక్తులు ఆలయానికి విచ్చేశారు. బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆలయ కమిటి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది .
భిక్కనూరు సిద్దరామేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల దృశ్యాలు...
Image Credit:
Bhiknoor Facebook Page