మన కామారెడ్డి: కామారెడ్డి ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కామారెడ్డి జిల్లా ప్రకటన చివరగా మన ముఖ్యమంత్రి నోటి ద్వార వచ్చేసింది. మిషన్ కాకతీయ పనులను ప్రారంభించటానికి సదాశివనగర్ కి విచ్చేసిన మన ముఖ్యమంత్రి, బహిరంగ సభలో మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడబోయే జిల్లాల జాబితాలో కామారెడ్డి వంద శాతం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో భారినీటిపారుదల శాఖా మంత్రి హరీష్ రావు తో పాటు ఇతర మంత్రులు, ఏంయల్ఎ లు మరియు తెరాస నాయకులు పాల్గొన్నారు.
నిజానికి కామారెడ్డి జిల్లా ప్రకటన రానున్న కాలంలో కామారెడ్డి లో జరిగే బహిరంగ సభలో ప్రకటించే ఆవకాశం వున్న సభలో పాల్గొన్న ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి ఈ సభ లోనే చేయాల్సివచ్చింది. కామారెడ్డి ప్రకటన వెలువడిన అనంతరం కామారెడ్డి ప్రాంత ప్రజలు హర్షాతిరేకంతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ప్రకటనకై మన కామారెడ్డి పోర్టల్ తో పాటు పోరాటం చేసిన కామారెడ్డి జిల్లా గా డిమాండ్ ఫేస్బుక్ పేజి మరియు కామారెడ్డి డిస్ట్రిక్ట్ పేజిలతో పాటు కామారెడ్డి ఐక్య కార్యాచరణ సమితి, విద్యార్ధి ఐక్య కార్యాచరణ సమితితో పాటు ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నాం.
- కెసిఆర్ కామారెడ్డి జిల్లా ప్రకటన చేస్తున్న వీడియో కోసం click చేయండి.
నిజానికి కామారెడ్డి జిల్లా ప్రకటన రానున్న కాలంలో కామారెడ్డి లో జరిగే బహిరంగ సభలో ప్రకటించే ఆవకాశం వున్న సభలో పాల్గొన్న ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి ఈ సభ లోనే చేయాల్సివచ్చింది. కామారెడ్డి ప్రకటన వెలువడిన అనంతరం కామారెడ్డి ప్రాంత ప్రజలు హర్షాతిరేకంతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ప్రకటనకై మన కామారెడ్డి పోర్టల్ తో పాటు పోరాటం చేసిన కామారెడ్డి జిల్లా గా డిమాండ్ ఫేస్బుక్ పేజి మరియు కామారెడ్డి డిస్ట్రిక్ట్ పేజిలతో పాటు కామారెడ్డి ఐక్య కార్యాచరణ సమితి, విద్యార్ధి ఐక్య కార్యాచరణ సమితితో పాటు ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నాం.
![]() |
| కామారెడ్డి జిల్లా ప్రకటన తర్వాత ఉద్వేగానికి లోనై ముఖ్యమంత్రి కెసిఆర్ కి పాదాభివందనం చేస్తున్న మన MLA, విప్ గంపగోవర్ధన్. |