శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం, సంతాయిపేట లో వుంది. పచ్చని ప్రకృతి మధ్య చూడటానికి ఎంతో అందంగా వుంటుంది. గర్భ గుడిలో భీమేశ్వర స్వామి స్వయంభువుగా లింగాకారంలో ఉంటాడు. ప్రధాన ఆలయానికి కుడి వైపున పార్వతి మాత ఆలయం మరియు ఆంజనేయ స్వామి ఆలయం కలదు. భీముడు ఈ ఆలయ సమీపంలోనే నాగలి తో దున్నాడని అక్కడి ఆనవాళ్ళు చెబుతాయి. ఆలయ సమీపంలో నాగలి కర్రు గుర్తులు ఉంటాయి. ఆలయం చుట్టూ ఉన్న పెద్ద పెద్ద రాళ్ళ పై వివిధ దేవత మూర్తుల విగ్రహాలు భక్తులను కనువిందు చేస్తాయి. ఈ ఆలయం ముందు నుండే భీమేశ్వర వాగు (సెలయేరు) ప్రవహిస్తుంది. ఈ ఆలయాన్ని వర్ష కాలంలో చూడటానికి రెండు కళ్ళు చాలవు .
ప్రతి సంవత్సరం శ్రావణ మాసం లో ఉత్సవాలు మరియు శివరాత్రి సమయంలో జాతర జరుగుతుంది . ఈ ఆలయం కామారెడ్డి కి సుమారు 20 కిమీ దూరంలో వుంటుంది. కామారెడ్డి నుండి ప్రతి గంట కి సంతాయిపేట కి బస్సు సౌకర్యం కలదు.
ప్రతి సంవత్సరం శ్రావణ మాసం లో ఉత్సవాలు మరియు శివరాత్రి సమయంలో జాతర జరుగుతుంది . ఈ ఆలయం కామారెడ్డి కి సుమారు 20 కిమీ దూరంలో వుంటుంది. కామారెడ్డి నుండి ప్రతి గంట కి సంతాయిపేట కి బస్సు సౌకర్యం కలదు.