నూతనంగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై
తెలంగాణా కవి డా.అందేశ్రీ గారి మాటల్లో...
శబ్దం పుట్టుక కొరకు శివాలు ఎత్తిన కంటాలకు పక్షవాతము పట్టుకున్నట్లు ఉంది.
ఎక్కడ చూసినా మౌనం, మౌనం..
నా తెలంగాణాకు మట్టికి పట్టిన చీడ నిన్నటి దిక్కారం దిగంతాలను దాటింది,
మరి ఇప్పుడు ఏమి ఏమౌతుంది ?? వెక్కిరింతలకు లోను అవుతుంది ,
పుట్టెడు కష్టాల పుట్టి మునిగి పోయింది.
తెలంగాణా కన్నీళ్ళకు, కడగల్లకు తెర తోలిగిపోయినట్టేనా?
తెలంగాణా విముక్తి కోసము పండుటాకుల్ల రాలిన అమరత్వపు, స్థూపానికి, దీపానికి దిక్కే లేకుండా పోతుంది. క్షేత్రాన్ని వదిలిపెట్టిన యోధున్ని, యుద్దము లో అలిసిపోయి వెనుతిరిగిన సైనికున్ని చరిత్ర ఎప్పుడు క్షమించదు. సామ్రని పొగలు వేసుకోవడము ,చేతికి అందిన సెంట్లు పుసుకోవడము సేద తిరినట్టు అవుతుందా ? నిప్పులు గక్కిన మలి దశ తెలంగాణా ఉద్యమ అస్థిత్వానికి చదలు పట్టినట్టు అవుతుందా? సమూహంగా కదిలినప్పుడే కదా విజయానికి చేరువయినాము, సామజికంగా వేరు అవుతూ, సమిష్టికి దూరము అవుతుంటే పలసన అయిపోమా? యుద్దము ముగిసిపోయింది అనా.. వర్త్ధమానము అంత నిశబ్దము?? ప్రశ్నిoచమని పలికిన నాలుకలే ప్రణాళిక బద్దంగా సంధి కోసం తలోగ్గుతున్నాయి, రాచరికపు పడుపు కూడు కోసము అమ్మ నిన్ను ఆమ్మను అని ప్రకటించుకొన్న పోతన మహత్యులు ఈ పొద్దున్న లేరు అనుకోవద్దు , నిక్కచ్చిగా బతుకాలి అని ఎ కవికి ఉండదు? నిక్కచ్చిగా బతుకలి అని ఎవ్వరికి ఉండదు? తన లోని అత్యాశే ఆ కవిని హత్య చేస్తుంది. నిటారుగా బ్రతుకాలి అని కోరుకోవడము దురాశేమి కాదు , ఉపరితలము భ్రమలే ఉపిరి సలుపుకోనివ్వడము లేదు ,ఆకలి ప్రపంచాన్ని నిర్మించింది ,ఆశ విశ్వ వ్యాప్తమై చిగురున్చింది. తన ఉనికిని, ఉహని ,మహోన్నత శిల్పంగా చెక్కు కున్న నైపుణ్యత మీ సేవ లో నిర్జీవం అయిపోవాలా? అక్షరం ఎప్పుడు అక్షయ పాత్రగానే ఆదుకుంటుంది, అమ్మకానికి నిలపడ్డప్పుడే సంత లో సరుకు అయిపోతుంది. శిఖరం తానే అయి, లోయ తానే అయి బ్రతకనేర్చిన మనిషిని ప్రశ్నoచడం ఎందుకు ? అంత ప్రశ్నార్ధకమే ! ఇది కవి వాక్కు, గాలి లో కలిసిపోయిందా గమనాలని నిర్మాణం చేస్తది , జనం లో నిలిచిపోయిందా కాలజ్ఞనం అయి నిలదిస్థది - డా.అందేశ్రీ
అందేశ్రీ గారి మాటలను జాగ్రత్తగా చదివితే మన తెలంగాణా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయి. అందేశ్రీ గారి మాటలు గనుక చదివితే తెలంగాణా ఉద్యమంలో అమరులైన అమరవీరుల ఆత్మలు కూడా ఎంత ఘోషిస్తాయో మరి.
జనం నాడి కవికి అందులో జానపదకవికి మాత్రమే తెలుస్తుంది అనటానికి పై మాటలు నిదర్శనం..హాట్స్ హాఫ్!!


