పాఠశాలలో నిబంధనలకు విరుద్దంగా పుస్తకాలు, నోట్ బుక్స్ , డ్రెస్సులు, అమ్మడాన్ని నిరసిస్తూ, కామారెడ్డి పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో బుధవారం ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆందోళన నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పాఠశాలల పేర్లకు చివర 'మోడల్' అని ఉండద్దని ఇదివరకే ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికి మాడల్ స్కూల్ అని ఉంచడం ఏంటని ప్రశ్నించారు.
ప్రయివేటు పాఠశాలల్లో నిబంధనలకు విరుద్దంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ , డ్రెస్సులు, తదితరాలను విక్రయిoచడం వెంటనే నిలిపివేయాలని లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టుతమని హెచ్చరించారు. విద్యాశాఖాధికారులు వెంటనే ఈ అంశంపై స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న ఫ్లెక్సీలను చించివేశారు.