మిషన్ కాకతీయ పథకంలో కొన్ని ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా చాల ప్రాంతాల్లో వున్నాయి, కాని చాల వరకు వెలుగులోకి రావటంలేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆయకట్టు భూములు అతి తక్కువగా వున్న కొన్ని చెరువులను కూడా మిషన్ కాకతీయ పథకం క్రింద చేర్చి కొందరు ప్రజా ప్రతినిధులు డబ్బులు దండుకుంటున్నారు అనే వార్తలు ప్రజల్లోనుండి వస్తున్నాయి. ఈ పథకంలో భాగంగా చెరువులతో పాటు వాటిని కలుపుతూ పోయే కాలువలను కూడా మరమ్మత్తు చేస్తే చాల ఉపయోగంగా వుంటుంది. ప్రజలకు మేలు చేసే ఈలాంటి పథకంలో మాత్రం ఆరోపణలు మన ప్రాంతం నుండి రావొద్దని కోరుకుందాం. ఒకవేళ మీ దృష్టికి ఏమైనా వస్తే మాకు షేర్ చేయగలరు.
ఈ క్రింద కనిపిస్తున్న సంఘటన (ఆర్టికల్) మన ప్రక్కన ఉన్న కరీంనగర్ జిల్లాలో జరిగింది.
 |
Click on image for bigger view |