సినిమాలలో తెలుగు ప్రేక్షకులను అలరించిన తార పూనం కౌర్ ని త్వరలో జరిగే మిస్ తెలంగాణా కాంటెస్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గ నియమించనుంది మన తెలంగాణా ప్రభుత్వం. మన తెలంగాణా ప్రభుత్వం ఏంటి ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గ నియమించటం అనుకుంటున్నారా!! కాని పూనం కౌర్ సొంత ఊరు మన నిజామాబాదు. ఒకానొక సమయంలో మంచి నటి గా గుర్తింపు పొందిన పూనం కౌర్ తర్వాత కాలంలో అవకాశాలు తగ్గటంతో ఈ మధ్య సినిమాలలో కనిపించటం లేదు. ఇన్నాళ్ళకు మన తెలంగాణా ప్రభుత్వం ఆమెను ఆదరించి ఆవకాశం ఇవ్వటం శుభపరిణామం. ఇప్పటికైనా మన తెలంగాణా ప్రభుత్వం కనుమరుగైన తెలంగాణా నటినటులను, కళాకారులను ఆదరించవలసిన అవసరం ఎంతైనా ఉంది.