హైదరాబాద్ నగరంతో ఎంతో అనుబంధమున్న ప్రజల రాష్ట్రపతి, భారత అణ్వస్త్ర పితామహుడు, నిత్యకృషీవలుడు, దార్శనికుడు, నిరాడంబరుడు, భరతమాత స్వయం సమృద్ది సాధన కోసం తన తుది శ్వాస వరకూ, నిరంతరం తల్లడిల్లిన భారతరత్నం కలాం అంత్యక్రియలకు తెలంగాణా ప్రభుత్వం తరుపున ఒక్కరంటే ఒక్కరు అధికారికంగా హాజరు కాకపోవడం శోచనీయం, ఆ కర్మయోగి విజ్ఞప్తికి విరుద్దంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించడం కూడా దారుణం అనిపించింది.
దేశం నలు మూలలనుండే కాకుండా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుండి వివధ ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు కలాం అంత్యక్రియలకు హాజరయ్యారు ఒక్క తెలంగాణా రాష్ట్రం మినహా. చనిపోయేవరకు ఆహర్నిశలు దేశం కోసం పనిచేసిన ఆ కర్మయోగి అంత్యక్రియలకు ఎందుకు హాజరు కాలేదో చెప్పవలసిన అవసరం వుంది. ప్రజలకు ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పడంతో పాటు చనిపోయేవరకు ప్రజల కోసమే పనిచేసిన వాళ్ళను గౌరవించి వుంటే బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారు.
హాజరు కాకపోవటం ప్రక్కన పెడితే అబ్దుల్ కలాం దేశ ప్రజల, తెలంగాణా ప్రజల గుండెల్లో మాత్రం ఎప్పటికి ఉంటాడు అనేది మాత్రం నిజం.
మన కామారెడ్డి


