ఈ సందర్భంగా అన్ని విధ్య సంస్థల యాజమాన్యాలు స్వచ్చందంగా మూసివేసారు. ఈ బంద్ లో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజేశ్ మాట్లాడుతూ విద్యాహక్కు చట్టాన్ని తక్షినమే అమల్లోకి తేవాలని, అలాగే కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య అమలు చేయాలని, ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ అమలు చేయాలని, పేద విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ పథకం వర్తింపజేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస వసతులు కల్పించాలని అయన డిమాండ్ చేసారు. తదనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు మోబిన్, సంతోష్, రాకేశ్, మహేశ్, తదితరులు పాల్గొన్నారు.