సంకటమోచన్ మహాబలి హనుమాన్ అనే సీరియల్ పబ్లిసిటీ కోసం సోనీ టివి సరికొత్త ప్రయత్నం చేసింది. లక్నో లో ఒక పెద్ద హనుమాన్ ఆకారంలో వున్న బొమ్మను తయారు చేసి డ్రోన్ టెక్నాలజీ సహాయంతో ఆ బొమ్మను గాలిలో ఎగిరిస్తూ ప్రజలను ఆనంద పరిచింది. ఆ హనుమాన్ ఆకారంలో వున్న బొమ్మను చూసిన ప్రజలు ఆనందంతో వెంటనే తమ తమ మొబైల్ ఫోన్ కెమెరాలలో బంధించారు. వినటానికి విచిత్రంగా వుంది కదూ!!






