ఆగస్ట్ 02 : కామారెడ్డి పట్టణ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం బోనాల పండగ ఘనంగా జరిగింది. అందంగా అలంకరించిన బోనాలను మహిళలు నెత్తిన పెట్టుకొని పట్టణంలోని మైసమ్మ ఆలయం వరకు డప్పు చప్పుడుల నడుమ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండి ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. కార్యక్రమంలో యాదవ సంఘం ప్రతినిధులతో పాటు వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
దేవునిపల్లిలో..
దేవునిపల్లి దత్తాత్రేయ కాలనీ లో హోలియ దాసరి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండగను వైభవంగా నిర్వహించారు.ఈ సందర్బంగా గ్రామ దేవతలైన ముత్యాల పోచమ్మ, భూలక్ష్మి, బద్ది పోచమ్మ, మదన పోచమ్మలకు మహిళలు భక్తితో బోనాలు సమర్పించారు. వర్షాలు కురిసి గ్రామం సుభిక్షంగా వుండాలని గ్రామ దేవతలను వేడుకున్నారు.
దేవునిపల్లిలో..