మన దేశంలో చాల గ్రామాలు పరిశుభ్రంగా ఉండవు అనే మాటలను అసత్యం చేస్తూ ప్రపంచానికి ముఖ్యంగా మన దేశానికి ఆదర్శంగా నిలిచింది మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో ఉన్న తమ్నాథ్ అనే గ్రామం. ఈ సంవత్సరానికి గాను ఆసియా ఖండంలోనే పరిశుభ్రంగా ఉన్న గ్రామాల జాబితాలో మొదటి స్థానంలో అలాగే ప్రపంచంలోనే ఐదవ స్థానంలో నిలిచింది ఈ గ్రామం.
సగటున తక్కువ ఆదాయం ఉన్న ప్రజలు ఎక్కువగా నివసించే ఆ గ్రామంలో, గ్రామ ప్రజల ఐఖ్యత, అత్యాధునిక సౌకర్యాల సమీకరణ, మరుగుదొడ్లు నిర్మించుకోవటానికి తగిన రాయితీలు ప్రకటించటం అలాగే ఇంటి బయట చెత్త వేయకుండా తగిన చర్యలు తీసుకోవటమే ఆ గ్రామ ప్రజల విజయ రహస్యం.
మన దేశంలో ఉన్న ప్రతి గ్రామం ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోని మన దేశాన్నిపరిశుభ్రమైన దేశంగా మార్చవలసిన అవసరం ఉంది.
తమ్నాథ్ గ్రామానికి సంబంధించిన కొన్ని చిత్రాలు మీకోసం..