ముంబై మహా నగరంలో గేట్ వే ఆఫ్ ఇండియాకు దగ్గరలో ఓ ఫుట్ పాత్ పై ఓ యువకుడు కళ్ళకు గంతలు కట్టుకొని,ప్లకార్డ్ పక్కన పెట్టుకొని నిలబడి ఉన్నాడు. ఆ ప్లకార్డ్ పై ʹనేను ముస్లింని, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరూ నన్ను నమ్మేట్టయితే వచ్చి నన్ను కౌగిలించుకోండిʹ అని వుంది.ఫుట్ పాత్ పై తిరిగే చాలా మంది చుట్టూ చేరి ఆ ప్లకార్డ్ పై వున్నది చదువుతూ అతన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇంతలో ఒక యువకుడు వచ్చి అతన్ని కౌగిలించుకున్నాడు, ఆ తర్వాత ఆ యువకున్ని చూసి చాల మంది అడ మగ తేడాలేకుండా అతన్ని కౌగలించుకుంటూన్నారు. మరికొందరు అతనితో మాట్లాడారు. కొందరు అతనితో ఫోటోలు దిగారు... ఇంతకి అతని పేరు ఏమిటంటే మాజిమ్ ముల్లా .
ఈ సంవత్సరం మొదట ఒక కెనడియన్ యువకుడు కూడా ఇలాంటి పనే చేసాడు. అది మాజిమ్ ను చాల ప్రభావితం చేసింది. అప్పట్లో ఆ కెనడియన్ యువకుడు ఇలాగే కళ్ళకు గంతలు కట్టుకొని చేపట్టిన కార్యక్రమం సంచలనం సృష్టించింది. పాలించేవారు, ముస్లింలపై టెర్రరిస్టులంటూ ముద్రవేయడం, ప్రపంచమంతా వారిని అనుమానంగా చూడటాన్ని తట్టుకోలేకే ఆ కెనడా యువకుడైనా, ముంబైలో మాజిమ్ అయినా ఇటువంటి ప్రయోగానికి సిద్దమైనారు. వాళ్ళు కోరుకున్నట్టే వాళ్ళిద్దరికీ మంచి మద్దతే లభించింది. మాజిమ్ ముల్లా చేసిన పని మాత్రం భారతీయులంత ఒక్కటే అనడానికి ఒక సాక్షంగా నిలిచింది. ఆ వీడియో మీకోసం..
This is our India!!భారతీయులంత ఒక్కటే అనడానికి సాక్షమే ఈ వీడియో!!This is Our #IndiaA Blind-folded Muslim Man From Mumbai Asked For Free Hugs. Watch How People Reacted.
Posted by Mana Kamareddy on Sunday, August 9, 2015