శ్రావణ సోమవారం పురస్కరించుకొని భిక్కనూరు శ్రీ సిద్దరామేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణతో మారుమోగింది. వివిధ ప్రాంతాలనుండి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులు క్యూలైన్లలో నిలబడి స్వామి వారిని దర్శించుకోవటానికి చాలా సమయం పట్టింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేసారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు మరియు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో నిర్వహించిన జడకోప్పు భక్తులను అమితంగా అలరించింది. గత వారం మాదిరిగా కాకుండా అర్చకులు సమ్మె విరమించడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేసారు.
![]() |
| ఆలయ ఆవరణలో జడకోప్పు ఆడుతున్న భక్తులు |
Photos By: Team Mana Kamareddy



