శ్రావణమాసం పురస్కరించుకొని కామారెడ్డిలోని శ్రీ షిర్టీసాయి ఆలయంలో శుక్రవారం కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా జరిగింది. భక్తులు సామూహికంగా కుంకుమార్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్భంగా సంతోషిమాత ఆలయాన్ని గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు.అలాగే అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. . అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ చేసి అన్నదానం చేశారు.