కామారెడ్డి పట్టణంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ వేడుకలు వేలాది మంది మహిళల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్యక్షురాలు, నిజామాబాదు ఎంపి కవిత ముఖ్య అతిథిగా హాజరై, కామారెడ్డి రైల్వే స్టేషన్ చౌరస్తా నుండి సాయంత్రం 6-30 గంటలకు ర్యాలీగా వెళ్ళి వీక్లీ మార్కెట్ గ్రౌండ్ కి చేరుకున్నారు. తదనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ యోగితా రాణా, కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మ, నిజామాబాదు మేయర్ సుజాత మరియు జెడ్పి వైస్ చైర్ పర్సన్ సుమనా రెడ్డి ఎంపి తో కలిసి బతుకమ్మ ఆడారు. అంతకుముందు ఎంపి, పట్టణంలోని వివిధ నాయకుల ఇళ్ళకి వెళ్ళి బతుకమ్మ పేరుస్తూ, పాటలు పాడుతూ మహిళలను అలరించారు.
అనంతరం జరిగిన సభలో ఎంపి కవిత మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కావడం ఖాయమని అన్నారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి తాగునీరందిస్తామని వెల్లడించారు. పదిహేను నెలల కాలంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినమని అన్నారు.

కామారెడ్డి పట్టణంలోని బంగారు బతుకమ్మ వేడుకల దృశ్యాలు మీకోసం..