కామారెడ్డి డివిజన్ లో బతుకమ్మ పండుగ ఘనంగా జరిగింది. కామారెడ్డి మండలంతోపాటు , దోమకొండ, భిక్కనూరు, ఎల్లారెడ్డి, తాడ్వాయి, లింగంపేట్, సదాశివనగర్, గాంధారి, మరియు నాగిరెడ్డిపేట్ మొదలగు మండల కేంద్రాలతోపాటు , వివిధ గ్రామాల్లో నిన్న ఉదయం నుండే పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం నుండే మహిళలు బతుకమ్మలను రంగురంగుల పూలతో పేరుస్తూ, సద్దుల బతుకమ్మకోసం సద్దులు, మలిద ముద్దలు తయారు చేస్తూ గడిపారు. సాయంత్రం బాజా బజంత్రిల తో వారి వారి కూడళ్ళకు చేరుకొని ఆట పాటల మధ్య బతుకమ్మ ఆడారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసి సద్దులు ఆరగించారు.
కామారెడ్డి డివిజన్ లో బతుకమ్మ పండుగ దృశ్యాలు..
 |
క్యాసంపల్లిలో |
 |
భిక్కనూరులో |
 |
భిక్కనూరులో |
Image Credit:
Kamareddy District Page
Bhiknoor Page
Mana Bhiknoor Page
Deme Kaalan Page