ఢిల్లీ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) క్యాంపస్ లో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయ్, వివిధ దేశాలకు చెందిన 8 పెద్ద పెద్ద కంపెనీలు రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నాయ్. చాలా మందికి ప్లేస్ మెంట్ ఇచ్చి ప్యాకేజీ ఫిక్స్ చేసుకుంటున్నారు కంపెనీ ప్రతినిధులు. అందులో నలుగురు విద్యార్థులకు కోటికి పైగా ప్యాకేజ్ ఇస్తాం అంటూ భారీ ఆఫర్ ను ప్రకటించింది ఒక విదేశీ కంపెనీ..అయినా, సారీ సార్ మేం చేయలేం అంటూ తేల్చి చెప్పేశారు ఆ నలుగురు కుర్రాళ్లు… మేం మాలో వున్న ప్రతిభను విదేశీ కంపెనీల ఎదుగుదలకు వాడాలనుకోవడం లేదు.. మా అవసరం మాదేశానికి చాలా ఉంది. ఇక్కడి చదువును ఇక్కడి అభివృద్దికే ఉపయోగిస్తాం. మీరు ఇస్తా అన్న కోటి రూపాయల ప్యాకేజీ కన్నా.. మేక్ ఇన్ ఇండియా అనే నినాదమే మాకు నచ్చింది. అందుకే ఇక్కడే ఉంటాం …మా ఆలోచనలకు అనుగుణంగా మేమే ఓ కంపెనీ పెట్టుకుంటాం అని తేల్చి చెప్పారు ఈ నలుగురు ఇంటెలీజెంట్ ఇంజనీర్స్.


