ఐదు దశాబ్దాలుగా, సరి కొత్త కోర్సులతో ఎందరో విద్యావంతులను తయారుచేసిన కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరో మైలు రాయిని చేరింది. జాతీయ స్థాయిలో ఉన్నత విద్యాసంస్థల, విశ్వవిద్యాలయాల ప్రమాణ స్థాయిని నిర్ణయించే న్యాక్ మన కామారెడ్డి డిగ్రీ కళాశాలకు (2.77 మార్కులతో) బి గ్రేడ్ ఇచ్చింది. రాష్ట్ర స్థాయిలో కామారెడ్డి డిగ్రీ కళాశాల ఎనమిదో స్థానంలో నిలువగా, జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. కామారెడ్డి డిగ్రీ కళాశాల, తెలంగాణ యూనివర్సిటీ కంటే 0.16 మార్కుల అధిక్యంలో ఉండటం మరో విశేషం. న్యాక్ బీ గ్రేడ్ పొందటం పట్ల కామారెడ్డి ప్రాంత ప్రజలలో ఆనందం వ్యక్తమౌతోంది. స్వల్ప మార్కుల తేడాతో 'ఏ' గ్రేడ్ కోల్పోయిన మన డిగ్రీ కళాశాల త్వరలో స్వయం ప్రతిపత్తి కల కళాశాలగా ఏర్పాటు అయ్యే అవకాశం వుంది.
కళాశాల భూములు వ్యహారం లాంటి సమస్యలు తొందరగా పరిష్కరించబడి, కామారెడ్డి డిగ్రీ కళాశాల మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ....
-మన కామారెడ్డి
కళాశాల భూములు వ్యహారం లాంటి సమస్యలు తొందరగా పరిష్కరించబడి, కామారెడ్డి డిగ్రీ కళాశాల మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ....
-మన కామారెడ్డి