
మన కామారెడ్డి: భిక్కనూరు మండల కేంద్రంలో వున్న బస్ స్టాండ్ రోజు రోజుకు నిరుపయోగంగా మారుతోంది. అసలే అరకొర బస్సులతో సతమతమౌతున్న ప్రయాణికులు, మండల కేంద్రానికి వచ్చే కొన్ని ఆర్డినరీ బస్సులు మినహా మిగితా బస్సులు బస్ స్టాండ్ లోనికి రాకుండా రోడ్డుపైనుండే వెళ్తుండటంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కొన్ని రోజులు మొక్కుబడిగా కంట్రోలర్ ని పెట్టి అతర్వాత తీసివేయటంతో బస్సులు బస్ స్టాండ్ లోకి రావటం లేదు. బస్ స్టాండ్ నిర్మానుష్యంగా మారటంతో బస్ స్టాండ్ లో వున్న బండలు సైతం దొంగతనానికి గుర్తెయ్యాయి. వేసవికాలం దృశ్య అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే కంట్రోలర్ ని శాశ్వతంగా ఏర్పాటు చేసి, బస్సులు బస్ స్టాండ్ లోనికి వచ్చేలా చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

