ప్రయాణ సమయంలో పోలీసులు లేదా రవాణా అధికారులు తనిఖీ చేస్తే ఆర్టీఏ ఎం-వాలెట్ యాప్ ఓపెన్ చేసి ఒక్క క్లిక్‌తోనే వాహనానికి సంబంధించిన పత్రాలన్నీ చూపించవచ్చు. ఈ యాప్ లో ఒక్కసారి మొబైల్ నెంబర్ తో నమోదు చేసుకుంటే చాలు.. ఏ ఇతర మొబైల్ నుంచి అయినా మన వాహనానికి సంబంధించిన వివరాల్ని చూడొచ్చు. వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినప్పుడు.. ఆ వాహనం ఎవరి పేరిట ఉన్నది..? నడిపే వ్యక్తి అసలు యజమానా? కాదా? అనే విషయం ఎంవాలెట్ యాప్‌లో ఇట్టే తెలిసిపోతుంది. ట్రాఫిక్ ఉల్లంఘించిన వ్యక్తి వాహనయజమాని కాకపోతే అతడి ఫోన్‌నంబర్‌కు సమాచారం అందుతుంది. ఎంవాలెట్ యాప్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్‌ఫామ్‌లలో లభిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి.. ఆర్టీఏ ఎం వ్యాలెట్ మొబైల్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి.
ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి..
- ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ కోసం Download క్లిక్ చేయండి
- ఐవోఎస్ యాప్ డౌన్లోడ్ కోసం Download క్లిక్ చేయండి
డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అయ్యే విధానం:
1.REGISTER బటన్ మీద క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి Resend OTP క్లిక్ చేయండి. ఆరెంకల నెంబర్ మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కి వస్తుంది .
2.ఆరెంకల OTP నెంబర్ ఎంటర్ చేసి SUBMIT క్లిక్ చేయాలి.
3.డ్రైవింగ్ లైసెన్స్ కోసం DRIVING LICENSE బటన్ క్లిక్ చేయండి ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, పుట్టిన తేది, మీరు డ్రైవింగ్ లైసెన్స్ పొందిన ఆఫీసుని సెలెక్ట్ చేసుకొని GET బటన్ క్లిక్ చేయండి
4.ఆర్సీ కోసం RC బటన్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ , 5 అంకెల చేసిస్స్ నెంబర్ ఎంటర్ చేసి GET బటన్ క్లిక్ చేయండి.