
నిన్నటి ప్రతిపాదనల ప్రకారం తెలంగాణలో మొత్తం 10 జిల్లాలు 23 జిల్లాలుగా మారనున్నాయి. అలాగే ప్రస్తుతమున్న 44 రెవెన్యూ డివిజన్ లకు తోడు కొత్తగా 9 రెవెన్యూ డివిజన్ లు ఏర్పడనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 459 మండలాలతో పాటు కొత్తగా 74 మండలాలు ఏర్పడబోతున్నాయి. మన కామారెడ్డి జిల్లాలో 10,68,773 మంది జనాభా మరియు జిల్లా వైశాల్యం 4025 చ.కి.మీ తోపాటు 21 మండలాలు వుండనున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల స్వరూపం :
• కామారెడ్డి జిల్లా: 10,68,773 మంది జనాభా, వైశాల్యం 4025 చ.కి.మీ, 21 మండలాలు• నిజామాబాద్ జిల్లా: 14,47,961 మంది జనాభా, వైశాల్యం 3772 చ.కి.మీ, 25 మండలాలు
• రంగారెడ్డి జిల్లా: 10,86,522 మంది జనాభా, వైశాల్యం 4157 చ.కి.మీ, 20 మండలాలు
• సంగారెడ్డి జిల్లా: 11,86,280 మంది జనాభా, వైశాల్యం 3116 చ.కి.మీ, 18 మండలాలు
• ఆచార్య జయశంకర్ జిల్లా: 8,59,453 మంది జనాభా- వైశాల్యం 6,760 చ.కి.మీ, 21 మండలాలు, 3 రెవెన్యూ డివిజన్లు
• వరంగల్ జిల్లా: 22,36,051 మంది జనాభా, వైశాల్యం 4883 చ.కి.మీ, 31 మండలాలు
• ఆదిలాబాద్ జిల్లా: 14,22,034 జనాభా- వైశాల్యం 7,673 చ.కి.మీ 27 మండలాలు, 4 రెవెన్యూ డివిజన్ లు
• భద్రాది జిల్లా: 11,93,807 జనాభా, వైశాల్యం 8297చ.కి.మీ, 23 మండలాలు
• జగిత్యాల జిల్లా: 10,43,000 మంది జనాభా, వైశాల్యం 3,087 చ.కి.మీ, 18 మండలాలు
• కరీంనగర్ జిల్లా: 18,02,038 మంది జనాభా, వైశాల్యం 4,308 చ.కి.మీ, 26 మండలాలు
• యాదాద్రి జిల్లా: 7,19,131 మంది జనాభా, వైశాల్యం 2,956 చ.కి.మీ,17 మండలాలు
• హైదరాబాద్ జిల్లా: 39,01,928 జనాభా, వైశాల్యం 1914 చ.కి.మీ, 20 మండలాలు
• ఖమ్మం జిల్లా: 13,80,137 మంది జనాభా, వైశాల్యం 4,360 చ.కి.మీ, 22 మండలాలు
• కొమురం భీం జిల్లా 13,19,205 మంది జనాభా, వైశాల్యం 8,422 చ.కి.మీ, 27 మండలాలు
• మహబూబాబాద్ జిల్లా 8,04,136 మంది జనాభా, వైశాల్యం 3633 చ.కి.మీ, 15 మండలాలు
• మహబూబ్ నగర్ జిల్లా: 18,67,620 మంది జనాభా, వైశాల్యం 6518 చ.కి.మీ, 31 మండలాలు
• మెదక్ జిల్లా: 14,44,955 మంది జనాభా,వైశాల్యం 4215 చ.కి.మీ , 25 మండలాలు
• నల్గొండ జిల్లా: 15,55,992 మంది జనాభా, వైశాల్యం 7475 చ.కి.మీ, 32 మండలాలు
• సికింద్రాబాద్ జిల్లా: 42,51,614 మంది జనాభా, వైశాల్యం 1608 చ.కి.మీ, 23 మండలాలు
• నాగర్ కర్నూలు జిల్లా: -10,48,425 మంది జనాభా, వైశాల్యం 7447 చ.కి.మీ, 22 మండలాలు
• వనపర్తి జిల్లా: 11,36,983 మంది జనాభా, వైశాల్యం 4426 చ.కి.మీ, 22 మండలాలు
• సిద్ధిపేట జిల్లా: 11,90,209 మంది జనాభా, వైశాల్యం 4398 చ.కి.మీ, 22 మండలాలు
• సూర్యాపేట జిల్లా: 13,86,883 మంది జనాభా వైశాల్యం 4348 చ.కి.మీ , 25 మండలాలు