ప్రపంచ వ్యాప్తంగా నిన్న విడుదలైన కబాలి సినిమాకి మన తెలంగాణకి లింకు ఉంది. ఈ సినిమా మొదటిలో రజనీకాంత్ తన జైలు జీవితం సందర్భంగా చదివిన మై ఫాదర్ బాలయ్య పుస్తకం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందుతున్నది. ఇది ఒక ఘనత అయితే.. అంతటి ఘనమైన పుస్తకాన్ని రాసింది తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామవాసి కావడం మరో ఘనతగా నిలుస్తున్నది.
ఈ పుస్తకాన్ని వైబీ సత్యనారాయణ (ఎల్కటి బాలయ్య సత్యనారాయణ) రచించారు. దళిత కుటుంబంలో పుట్టిన సత్యనారాయణ తల్లిదండ్రులు బాలయ్య, నర్సమ్మ. తన తండ్రి గురించి సత్యనారాయణ రాసిందే ఈ పుస్తకం.
బాలయ్య నిజాం కాలంలో రైల్వే ఉద్యోగిగా పనిచేశారు. ఖమ్మం జిల్లా బోనకల్‌కు బదిలీపై వెళ్లారు. సత్యనారాయణ ప్రాథమిక విద్యాభ్యాసం అక్కడే మొదలైంది. సికింద్రాబాద్ లాలాగూడ రైల్వే పాఠశాలలో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఉన్నతవిద్యను పూర్తిచేసి ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించి రిటైర్ అయ్యారు. రెండో కూతురు అమెరికాలో స్థిరపడటంతో చూసేందుకు వెళ్లారు. అక్కడ తన మనుమరాలిని చూసిన తర్వాత వంగపల్లిలో పుట్టి పెరిగిన తమ కుటుంబ ప్రస్థానం అమెరికాలో స్థిరపడ్డ వారికి తెలియాలంటే పుస్తకం రాయాలనే ఆలోచన కలిగిందని సత్యనారాయణ చెప్పారు. నాలుగు తరాల కుటుంబ ప్రస్థానంతోపాటు నిజాం కాలంలో దళితులు ఎదుర్కొన్న సమస్యలను మై ఫాదర్ బాలయ్య అనే పేరుతో ఆంగ్ల భాషలో పుస్తకం రాశారు. అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో మై ఫాదర్ బాలయ్య పుస్తకం పాఠ్యాంశంగా ఉండటం విశేషం. 2011లో హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మల్లెపల్లి లక్ష్మయ్య, సీనియర్ పాత్రికేయుడు రామచంద్రమూర్తి తదితరుల సమక్షంలో పుస్తకావిష్కరణ జరిగింది. 2013లో తెలుగులో, 2014లో కన్నడ, 2015లో హిందీ భాషల్లోకి పుస్తకం అనువాదం అయింది. మరో మూడు నెలల్లో తమిళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అనువాదం వెలువడనున్నట్టు సత్యనారాయణ తెలిపారు.
Source: నమస్తే తెలంగాణ