
రియో ఒలంపిక్స్ లో వెండి పతకం సాధించిన సింధుని అభినందించాల్సిందే. కాని కోట్లకు కోట్లు, వేల గజాల స్ధలాలను ప్రభుత్వం వాళ్ళ కి దారా దత్తం చేయటం సమంజసం కాదు.
అవే కోట్లు ఖర్చు పెట్టి ఎంతో మంది ఆర్ధిక స్ధోమత లేని క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలి . కాని ఇలా కోట్లు ఒక్కరికే కుమ్మరించటం మంచి సాంప్రదాయం కాదు.
అమెరికా స్విమ్మర్ ఫెల్ప్స్ ఒలంపిక్స్ లో మొత్తం 23 స్వర్ణ పతకాలు సాధించాడు. మనలా అయితే అమెరికా దేశం ఒక రాష్ట్రాన్ని రాసివ్వాలి కాని. అది అక్కడ సాధారణం.
తెలంగాణలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవు దానితోపాటు ఎంతో మంది పిల్లలు ఆర్ధిక స్ధోమత లేక బడికి రావటం లేదు. అటువంటి సమస్యల పైన నిధులు పెట్టండి హర్షనీయంగా ఉంటుంది.
పాలకులారా, దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కనీసం సలహాలు ఇచ్చే వారు లేక, కోచ్ లను పెట్టుకనే స్థోమత లేని వారు అనేక మంది క్రీడాకారులు రాణించటానికి సిద్ధంగా వున్నారు. అలాంటి వాళ్ళ కోసం ప్రతి జిల్లాకు ఒక క్రీడలకు సంబంధించిన అకాడమీలను నెలకొల్పి క్రీడా రత్నాలను వెలికితీయవలసిన అవసరం వుంది.